రోజాలో మార్పు రాలేదు, ఏమైనా పర్వతమా లేక..: వంగలపూడి అనిత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను అడ్డుకోలేకే ప్రభుత్వం ఆమె పైన సస్పెన్షన్ పొడిగింపు చర్యలు తీసుకోవాలనుకుంటుందన్న వైసిపి ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్యే అనిత ఘాటుగా స్పందించారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను అడ్డుకోలేకే ప్రభుత్వం ఆమె పైన సస్పెన్షన్ పొడిగింపు చర్యలు తీసుకోవాలనుకుంటుందన్న వైసిపి ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్యే అనిత ఘాటుగా స్పందించారు.
రోజాను చూసి భయపడేందుకు ఆమె ఏమైనా పర్వతమా లేక సబ్జెక్టుల్లో నిపుణురాలా అని నిలదీశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రోజాతో క్షమాపణలు చెప్పించాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని ప్రశ్నించారు.
రోజాపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. నివేదికపై స్పీకర్, సభ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. అసెంబ్లీ ఘటనలను ఎడిట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు.

రోజా వ్యాఖ్యల కారణంగా తాను చాలాకాలం డిప్రెషన్‌లోకి కూడా వెళ్లానని చెప్పారు. రోజా మాట తీరు అసభ్యంగా ఉందని చెప్పారు. ఆమె ఎంతో జ్ఞానవంతురాలు, మేం తట్టుకోలేమని మాకు ఏమాత్రం లేదన్నారు.
అసెంబ్లీలో రోజా ప్రవర్తనకు ఏడాది పాటు సస్పెన్షన్ వేస్తే, ఆమెలో ఏ మార్పు రాలేదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. అలాంటప్పుడు ఆమెపై సస్పెన్షన్ వేయడమే మంచిదన్నారు.
నేను క్షమాపణ చెప్పనని రోజా అంటున్నారని, అలా అంటే ఎలా అన్నారు. ఎడిటింగ్, డబ్బింగ్ చేసేందుకు ఇది (అసెంబ్లీ) సభ అన్నారు. సభలో ఆమె క్షమాపణ చెప్పి, స్పీకర్ ఓకే చేస్తే తాను సంతృప్తి చెందుతానని చెప్పారు. ఎడిటింగ్ చేశారనుకుంటే న్యాయపోరాటం చేయవచ్చన్నారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications