విజయవాడ మేయర్ అభ్యర్దిగా వంగవీటి ఆశాలతా, అక్కడే అసలు ట్విస్ట్..!?

ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల కోసం తుది కసరత్తు చేస్తున్నాయి. ముందుగా మున్సిపల్.. ఆ వెంటనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే కూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు ఆసక్తి కరంగా మారుతోంది. కాగా, విజయవాడ మేయర్ సీటు కోసం చర్చ మొదలైంది. తాజాగా వంగవీటి పేరు తెర మీదకు వచ్చింది. మేయర్ అభ్యర్దిగా బరిలో నిలుస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

మున్సిపల్ ఎన్నికలకు వచ్చే వారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 16 కార్పోరేషన్.. 84 మున్సిపాల్టీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా, విజయవాడ కార్పోరేషన్ కోసం జనసేన ప్రయత్నం చేస్తోంది. కూటమిలో సీట్ల సర్దబాటులో తమకు విజయవాడ కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అయితే, టీడీపీ విజయవాడ వదులుకోవటానికి సిద్దంగా లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

విశాఖ, విజయవాడ మెట్రో పై కేంద్రం తాజా నిర్ణయం - కొత్త రూట్, డీపీఆర్..!!
విశాఖ, విజయవాడ మెట్రో పై కేంద్రం తాజా నిర్ణయం - కొత్త రూట్, డీపీఆర్..!!
Vangaveeti Ashalatha chances to contest as Vijayawada mayor candidate for upcoming municipal Elections

మేయర్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరగనుండటంతో.. పార్టీలు క్లీన్ ఇమేజ్ తో పాటుగా ప్రజాదరణ ఉన్న నేతను ఎంపిక చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తన కుమారుడిని మేయర్ అభ్యర్దిగా బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెర మీదకు వంగవీటి పేరు తెర మీదకు రావటం ఆసక్తి కరంగా మారుతోంది.

వంగవీటి రంగా కుమారుడు రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇదే సమయంలో వంగవీటి ఆశాలతా రాజకీయంగా క్రియాశీలకం గా మారుతున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ పోరులో మేయర్ అభ్యర్దిగా వంగవీటి ఆశాలత పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు ఆశాలతా ఏ పార్టీలోనూ చేరలేదు. రాధ రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వైసీపీ, జనసేన నుంచి ఆశా లతకు ఆహ్వానం ఉందని చెబుతున్నారు.

 విశాఖ - విజయవాడ- తిరుపతి రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఇక నుంచి కొత్తగా..!!
విశాఖ - విజయవాడ- తిరుపతి రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్: ఇక నుంచి కొత్తగా..!!

అయితే.. ఆశాలతా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాగా.. తాజాగా ఆశాలతా టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం నగరంలో వినిపిస్తోంది. మేయర్ గా అవకాశం ఇస్తే టీడీపీలో చేరే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో.. హోరా హోరీగా మారుతున్న కీలకమైన విజయవాడ మేయర్ స్థానం అసలు కూటమి లో టీడీపీ- జనసేన లో ఎవరికి దక్కుతుందీ... ఆశాలతా బరిలో నిలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+