తొక్కిసలాట ఘటన పై ఢిల్లీకి ఫిర్యాదు..!!
తిరుపతిలో తొక్కిసలాట ఘటన పై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే తిరుపతి లో తొక్కిసలాట జరిగిందని.. ఛైర్మన్, ఈవో పై జాతయ మానవ హక్కుల సంఘానికి.. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు వెళ్లింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వంగవీటి నరేంద్ర వెల్లడించారు. చంద్రబాబు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యుడని వంగవీటి నరేంద్ర ఆరోపిం చారు. ఈ ఘటనపై సీఎంతో పాటు, టీటీడీ ఛైర్మన్, ఈఓపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు వైఖరి వల్ల గోదావరి పుష్కరాలు మొదలు, పలు సందర్భాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. రాష్ట్రపతితో పాటు, కేంద్ర హోం మంత్రిని లేఖ ద్వారా కోరామని తెలిపారు. ఏ మాత్రం అర్హత లేని బీఆర్ నాయుడిని సీఎం చంద్రబాబు క్విడ్‌ప్రోకో కింద టీటీడీ ఛైర్మన్‌ను చేశారని వంగవీటి నరేంద్ర ఆరోపించారు.

తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా పని చేయడంతో, చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టాడని ఆక్షేపించారు. చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా యని, అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరి పుష్క రాల్లో 29 మంది బలి కాగా, ఆ తర్వాత కందుకూరులో మీటింగ్‌లో 7గురు, ఆ తర్వాత గుంటూరు లో మరో ముగ్గురు చనిపోయారని చెప్పుకొచ్చారు. అందుకే ఇకనైనా అలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సంబంధం లేని వారిపై చర్య తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications