వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!

టీడీపీ నేత వంగవీటి రాధ (Vangaveeti radha) ఇవాళ ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ విజయవాడ మేయర్ అభ్యర్ధిగా ఆయనతో పోటీ చేయించాలని నిర్ణయించిన కూటమి పార్టీలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో వంగవీటి రాధ ఇవాళ జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అయితే అదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

జనసేన పార్టీలో వంగవీటి రాధ చేరుతున్న సమయంలోనే, ఇందులో పాల్గొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను (Samineni Udaya Bhanu) వచ్చారు. అయితే ఆయన్ను పార్టీ కార్యాలయంలోకి అనుమతించకుండా భద్రతా సిబ్బంది గేటు వద్దే నిలిపేశారు. అలా ఓ పావు గంట పాటు సామినేని ఉదయ భాను పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కారులోనే గేటు బయట ఉండిపోయారు. ఆ తర్వాత పార్టీ నాయకులు జోక్యం చేసుకుని ఆయన్ను లోపలికి అనుమతించినట్లు తెలుస్తోంది. చివరికి సామినేని కారు దిగి నడుచుకుంటూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు.

Vangaveeti Radha Joins Jana Sena Drama Unfolds as Samineni Udaya Bhanu Is Stopped Outside Office

వంగవీటి రాధ కూడా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నాయకుడే. అదే జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సామినేని ఉదయభాను అలా ఆయన చేరిక సమయంలో అక్కడ లేకుండా పోయారు. దీంతో సామినేని ఉదయభానును ఉద్దేశపూర్వకంగానే లోపలికి వెళ్లకుండా ఎవరైనా అడ్డుకున్నారా లేక భద్రతా సిబ్బంది సాధారణ కారణాలతోనే ఆయన్ను గేటు బయట ఆపారో తెలియలేదు. చివరికి కీలకమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలస్యం కావడంతో సామినేని ఉదయభాను అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగిన ఘటనపై జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది తీరుపై సామినేని అనుచరులు అసహనంగా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+