టీడీపీకి వంగవీటి రాధా గుడ్ బై .. ఆ పార్టీతో చర్చలు..?

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికార వైసీపీ 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించగా, ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తులో భాగంగా మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నాయి. ఈక్రమంలో టికెట్ దక్కని నేతలు తమ పార్టీలను వీడి, టికెట్‌పై హామీ ఉన్న పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకంటించారు. రాధాకు మరోసారి మొండిచేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.

Vangaveeti radha quit from tdp

వైసీపీలో చేరితే మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని ఇస్తామని రాధాకు ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే రాధా వైసీపీలోకి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. తాజాగా రాధా టీడీపీని వీడి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాధాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

బాలశౌరి ఇటీవల అధికార వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరుఫున పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఎలాగైనా రాధాను జనసేనలోకి తీసుకురావడానికి బాలశౌరి ప్రయత్నాలు చేస్తున్నారు. రాధా జనసేనలో చేరితో అవనిగడ్డ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. రాధాను జనసేనలోకి తీసుకువచ్చి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ కేటాయించేలా జనసేన నాయకత్వంపై బాలశౌరి ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. మరి రాధా టీడీపీని వీడి జనసేనలో చేరతారో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+