Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీకి చేయి: జగన్‌ను అత్యవసరంగా కలిసిన వంగవీటి రాధా, పార్టీ మారాలనుకుంటే

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, టీడీపీ ఆశలను ఆయన నీరుగార్చారు. ఆయన వైసీపీలోనే కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. టీడీపీలో చేరుతారనే ప్రచారంపై వంగవీటి రాధా గురువారం వరకు స్పందించలేదు.

చదవండి: ప్రశాంత్ కిషోర్ చిచ్చు!: జగన్ పిలిచినా వంగవీటి నో, గౌతం వ్యవహారం కూడా

దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశ్యంలో భాగంగానే నోరు మెదపలేదనే ప్రచారం సాగింది. కానీ తాను పార్టీ మారేది లేదని ఆయన గురువారం చెప్పారు. అంతేకాదు, చిత్తూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు.

చదవండి: 'టీడీపీలోకి వంగవీటి రాధా, అంతా మైండ్ గేమ్, పథకం ప్రకారమే': జగన్ 2సార్లు బుజ్జగించినా!

చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

 జగన్‌ను అత్యవసరంగా కలిసిన వంగవీటి

జగన్‌ను అత్యవసరంగా కలిసిన వంగవీటి

జగన్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో వంగవీటి రాధా ఆయనను లోటస్ పాండులో అత్యవసరంగా కలిశారు. ఈ భేటీలో పార్టీని వీడుతారనే ప్రచారంపై చర్చించారని తెలుస్తోంది. తాను పార్టీ మారుతారనేది అంతా వట్టిదేనని ఆయన జగన్ వద్ద చెప్పారని తెలుస్తోంది.

ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే

ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే

అదే విషయం ఆయన మీడియా ముందు కూడా మరోసారి స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలని పనిగట్టుకొని ప్రచారం చేశారని వంగవీటి రాధా వాపోయారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పారు. మొత్తానికి వంగవీటి రాధా తనపై వస్తున్న ప్రచారానికి తెరదింపే ప్రయత్నం చేశారు.

నా పని నేను చేసుకు వెళ్తున్నా

నా పని నేను చేసుకు వెళ్తున్నా

కాగా, అంతకుముందు వంగవీటి రాధా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు. తాను టీడీపీ వైపు అడుగులు వేయడంపై మీడియానే చెప్పాలని, తన కంటే ముందు మీడియానే ప్రకటించిందన్నారు. టీడీపీలో చేరుతున్నారనే వార్తలను ఖండించడం లేదని అడిగితే.. దేనికైనా సమయం రావాలని, తన పని తాను చేసుకొని వెళ్తున్నానని చెప్పారు.

 పార్టీ మారాలనుకుంటే హడావుడి పడను

పార్టీ మారాలనుకుంటే హడావుడి పడను

తాను పార్టీ మారాలనుకుంటే హడావుడి పడనని, పక్కా ప్రణాళిక ప్రకటించి వెళ్తానని వంగవీటి రాధా చెప్పారు. తనను టిడిపిలో చేరమని ఎవరూ సంప్రదించలేదని, తాను కూడా ఎవరినీ కలవలేదని చెప్పారు. తనకు రాజకీయేతర సంబంధాలు ఉన్నాయని, బంధువులు, స్నేహితులు, కావాల్సిన వాళ్లు ఉన్నారని చెప్పారు.

 చిన్నా చితకా పదవి కోసం, చెప్పి మరీ వెళ్తా

చిన్నా చితకా పదవి కోసం, చెప్పి మరీ వెళ్తా

తాను ఎమ్మెల్సీ వంటి చిన్నా చితకా పదవుల కోసం పార్టీ మారే మనిషిని కాదని వంగవీటి రాధా చెప్పారు. అసలు తాను టీడీపీలో చేరుతున్నానని ఎందుకు వార్త వచ్చిందో అన్నారు. ఇటీవల నున్నలో జరిగిన వైసీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నానని, అసంతృప్తితో ఉంటే ఎలా పాల్గొంటానని అన్నారు. తన ప్రమేయం లేకుండా ప్రచారం జరుగుతోందని, అందుకే ఖండించడం లేదని చెప్పారు. తాను వెళ్లాలనుకుంటే చెప్పి మరీ వెళ్తా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+