పోలీసులకు చిక్కితే అదృష్టం, మాకు చిక్కితే..: రంగా విగ్రహ ధ్వంసంపై వంగవీటి రాధా
బెజవాడలో దివంగత వంగవీటి రంగా విగ్రహం విధ్వంసం ఉద్రిక్తతకు దారి తీసింది.
విజయవాడ: బెజవాడలో దివంగత వంగవీటి రంగా విగ్రహం విధ్వంసం ఉద్రిక్తతకు దారి తీసింది. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు పోలీసులకు దొరికితే అదృష్టవంతులు అని, రంగా అభిమానులకు దొరికితే మాత్రం వారి ఖర్మ అని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు.
శనివారం అర్ధరాత్రి సింగ్ నగర్లో రంగా విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలిసిన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో పాటు రంగా అభిమానులు, వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు శిక్షించాలన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజీ చూస్తున్నారని తెలుస్తోందని, వారు చూస్తున్నందున తాము ఇప్పుడు ఏమీ అనలేమన్నారు.
ఫుటేజీని పరిశీలించిన తర్వాత మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు పోలీసులకు చిక్కితే అదృష్టవంతులు అవుతారని, అభిమానులకు దొరికితే మాత్రం వారి ఖర్మ అని హెచ్చరించారు.
సిసి కెమెరాలు పరిశీలించి నిజాలను నిగ్గుతేల్చాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రంగా అభిమానులకు దొరికితే వారు తాట తీస్తారని రాధాకృష్ణ అన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications