రాజకీయాల్లోకి వంగావీటి రంగా కూతురు?
Vangaveeti Ranga: విజయవాడ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వీటికి- దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా కుటుంబం కేంద్ర బిందువుగా మారుతోంది. మొన్నటికి మొన్న వంగవీటి రాధా.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆయన ఇంటికి వెళ్లడంలో అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతోన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరమైంది. రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశ కిరణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని, దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రేపో, మాపో ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విజయవాడ బందరు రోడ్డులోగల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే విషయాన్ని తోసిపుచ్చట్లేదు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు. విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగా వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నను దాటవేశారు. దీనిపై మరోసారి మాట్లాడతానని చెప్పారు. రంగా ఒక్క కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని అన్నారు.
రాధా రంగా మిత్ర మండలిలో కొంత విభేదాలు ఉన్నాయని, అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, దీని కోసం బయటికి వచ్చానని అన్నారు. ఇకపై రంగా అభిమానులను క్రమం తప్పకుండా కలుస్తానని, వారికి ఏ అవసరం వచ్చినా నేనున్నాననే ధైర్యం ఇస్తానని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తమ ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications