వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ రిజైన్ చేయొచ్చు: టీజీ, మీకిష్టమైందేనా: కామినేని, జగన్ కాల్‌డేటా తీయాలన్న వర్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో సెక్షన్ 8 అమలు ఇష్టం లేకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేసుకోవచ్చునని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. సెక్షన్ 8 అమలు చేస్తే కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తారని, నిరసన చేపడతారని ప్రచారం సాగుతోంది.

ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. విభజన చట్టం ద్వారా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్, అదే చట్టంలోని సెక్షన్ 8ను వ్యతిరేకించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు సెక్షన్ 8 ఇష్టం లేకుంటే రాజీనామా చేయవచ్చునని, దానికి తమకు అభ్యంతరం లేదన్నారు. తమకు సెక్షన్ 8 కావాల్సిందేనని పట్టుబట్టారు.

ఇప్పుడు గగ్గోలు: కేసీఆర్‌పై యనమల

సెక్షన్ 8 పైన తెరాస అనవసర రాద్దాంతం చేస్తోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు విభజన చట్టాన్ని అంగీకరించిన వారే ఇప్పుడు గగ్గోలు పెట్టడం గమనార్హమన్నారు.

Varla demands for YS Jagan call data

సెక్షన్ 8 అనేది రాజ్యాంగ వ్యతిరేక చర్య కాదన్నారు. విభజన చట్టం చెబుతున్న నిబంధనలనే తాము అమలు చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు.

ఎప్పటి నుంచో కోరుతున్నాం: కామినేని

ఎప్పటి నుంచో సెక్షన్ 8 అమలు చేయాలని తాము కోరుతున్నామని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. అమలయ్యే సెక్షన్లు, కాని సెక్షన్లు అంటూ ఉండవన్నారు. హైదరాబాదులో ఆంధ్రులకు అన్యాయం వాస్తవమన్నారు. సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్రం భావించడం సరికాదా అన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. జైరాం రమేష్, కేసీఆర్ కూర్చొని విభజన చట్టాన్ని రూపొందించారన్నారు.

138 చట్టాలలో ఇది ఒకటి: పత్తిపాటి

ఏపీ పునర్విభజన చట్టంలోని 138 చట్టాలలో సెక్షన్ 8 ఒకటి అని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. అన్ని సెక్షన్లు కలిస్తేనే పునర్విభజన చట్టం అవుతుందన్నారు. కేసీఆర్‌కు కావాల్సినవే చట్టం, కానివి కాదంటే కుదరదన్నారు.

ఇబ్బంది పెట్టేందుకు కుట్ర: వర్ల

ఓటుకు నోటు వ్యవహారంలో వైసీపీ చీఫ్ జగన్‌ ఫోన్ కాల్స్‌ వివరాలను తెలంగాణ ఏసీబీ అధికారులు సేకరించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అప్పుడే ఈ కేసులో జగన్‌ పాత్ర బయటి ప్రపంచానికి తెలుస్తుందన్నారు.

విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్, జగన్‌ కలిసి కుట్ర పన్నాయన్నారు. కేసీఆర్‌, హరీశ్ రావుతో జగన్‌ తరుచూ ఫోన్‌లో మాట్లాడేవారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై తమకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, తెలంగాణ నేతలు అరెస్టులకు సిద్ధంగా ఉండాలన్నారు.

English summary
Varla Ramaiah demands for YS Jagan call data
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X