అంబేద్కర్‌గా నటిస్తున్న వర్ల: మహిళ ఎమ్మెల్యేతోపాటు మరో ముగ్గురూ(పిక్చర్స్)
అమరావతి: బుల్లి తెర(టీవీ)పై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌గా ఏపీ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య కనిపించనున్నారు. అంబేద్కర్ జీవితంపై దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతున్న డా. బీఆర్ అంబేద్కర్ సీరియల్‌లో రామయ్యతో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు నటించారు.

అంబేద్కర్‌గా వర్ల
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ నిర్మిస్తున్న ఈ ధారావాహికలో అంబేద్కర్ అంతిమ దశకు సంబంధించిన పాత్రను వర్ల రామయ్య పోషిస్తున్నారు. ఇటీవలే విజయవాడ పరిసరాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
Recommended Video


మరో ముగ్గురు ఎమ్మెల్యు కూడా..
పాయకరావుపేట ఎమ్మెల్యే వి అనిత.. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్‌గా, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు.. లాలాలజపతిరాయ్‌గా, నందిగామ ఎమ్మెల్యే సౌమ్య.. విద్యార్థి నాయకురాలు ప్రీతిలత వాడేవార్‌గా నటించారు.

పాత్రోచితంగా నటించారు..
అంబేద్కర్ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను వదిలిపెట్టకుండా వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో నటించిన నలుగురు ఎమ్మెల్యేలూ పాత్రోచితంగా సహజంగా నటించినట్లు దిలీప్ రాజా ప్రశంసించారు. ఆగస్టు నెలాఖరులోగా 100 ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయన్నారు.

తొలిసారి పూర్తిగా.
అంబేద్కర్ జీవిత చరిత్రపై కొన్ని సినిమాలు/టీవీ సీరియల్స్ వచ్చినప్పటికీ సమయం వలన వివరంగా అన్ని అంశాలను చూపలేకపోయారన్నారు. అయితే 100 ఎపిసోడ్స్ భారతదేశంలో వేరెవ్వరూ చిత్రీకరించలేదని దిలీప్ రాజా తెలిపారు. అంబేద్కర్ జీవితాన్ని చిత్రీకరించే అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతమని అభిప్రాయపడ్డారు.

100రోజుల పండగ ఘనంగా..
భావితరాలకు కానుకగా ఇది చరిత్రగా మిగిలిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దృష్టాన్ని తనకు అందించిన ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ సీరియల్ 100రోజుల పండుగను రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తన నియోజకవర్గంలోని స్లెర్లింగ్ రిసార్ట్స్‌లో ఆగస్టు చివర్లో భారీ నిర్వహిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications