లక్ష్మీస్ ఎన్టీఆర్ రగడ: 'మీ నోరుకు నమస్కారం, గొప్ప పాఠం చెప్పారు, ఫీజు ఏ అడ్రస్‌కు పంపించాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్, ఐతే మీరే హీరో: సోమిరెడ్డికి వర్మ కౌంటర్

ఎన్టీఆర్‌పై వర్మ తీసే సినిమా రాజకీయ ప్రయోజనాలతో కాకుండా, ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలని సోమిరెడ్డి అన్నారు.

 లక్ష్మీపార్వతి పాత్ర వర్మకు తెలియదా

లక్ష్మీపార్వతి పాత్ర వర్మకు తెలియదా

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్ర ఏమిటో వర్మకు తెలియదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సినిమా రంగంలో అరవై ఏళ్లు మకుటం లేని మహరాజులా వెలిగిన ఎన్టీఆర్, రాజకీయాల్లోను ఎదురులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఎన్టీఆర్‌తో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత లక్ష్మీపార్వతి వ్యవహారశైలి, టిడిపి నాశనం కావాలనే ఆమె ప్రయత్నాలు వర్మకు తెలియదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కావాలంటే లక్ష్మీపార్వతినే హీరోయిన్‌గా పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, రాజకీయ ప్రయోజనాలతో తీస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. దీనిపై వర్మ కూడా ఘాటుగానే స్పందించారు. అనంతరం ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. మినిస్టర్ సోమిరెడ్డి కామెంట్స్‌కు నా రిప్లైస్ అంటూ వరుస పోస్టులు పెట్టారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్'పై లోకేష్ ఇలా: లక్ష్మీపార్వతి హీరోయిన్ ఐతే హీరో మీరే | Oneindia Telugu
వర్మ ప్రశ్నలు, సమాధానాలు

వర్మ ప్రశ్నలు, సమాధానాలు

టిడిపి మంత్రి మర్యాద తిమ్మన్న సోమిరెడ్డి గారి కామెంట్స్ అంటూ వర్మ ప్రశ్నలు, సమాధానాలు ఇచ్చారు.

మినిస్టర్: NTR జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరోగా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం. నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి అని సోమిరెడ్డి అన్నట్లుగా పేర్కొన్నారు.

దానికి వర్మ తన సమాధానమంటూ ఇలా చెప్పారు. సార్ మీరు హీరోయిన్‌గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పాడుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా.

లక్ష్మీపార్వతి అంటే గౌరవం..

లక్ష్మీపార్వతి అంటే గౌరవం..

మినిస్టర్: లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది. అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా.

వర్మ: అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ, హీరోయిన్లపై మీ ఈ insulting కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లు మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత.. అంటూ వర్మ పోస్టులో పెట్టారు.

మినిస్టర్: ఎన్టీఆర్ గురించి నాకు తెలిసినంతగా రాంగోపాల్ వర్మకు తెలియదు.
వర్మ: మై డియర్ మినిసిటర్, ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని ?

 నీ నోరుకు నమస్కారం

నీ నోరుకు నమస్కారం

మినిస్టర్: రాజకీయ ఉద్దేశాలతోనే ఈ సినిమాను ఎన్నికల ముందు తీస్తున్నారు.

వర్మ: సోమి ,రాజకీయ ఉద్దేశాలు ఏమి లేకుండానే రాజకీయ నాయకుడివి అయ్యావా..... అలా అయితే నీ నోరుకు నా నమస్కారం.

మినిస్టర్: రాజకీయ కారణాల కోసమే ఈ సినిమాకు వైసిపి నేత నిర్మాతగా వున్నారు.
వర్మ: ఛా! మా నాయనే... నీ ఇల్లు బంగారం గాను... చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్.. వావ్.

మినిస్టర్: ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీపార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరు.
వర్మ: ఓహ్ సార్ ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో, బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్. అని పేర్కొన్నారు.

గుమ్మడిగాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం

గుమ్మడిగాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం

మినిస్టర్: రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా గురించి మేము భయపడటం లేదు.

వర్మ: భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు ? కేవలం అడుగుతున్నా.. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా సార్ ?

మినిస్టర్ సోమి: రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవమ్ తీయమని అంటున్నా.
వర్మ: అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా లేక మంచం కింద దాక్కునేవారా? ...రెడ్డిగారు చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము.
చివరగా నాకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారి గురించి తెలుసన్న సోమిరెడ్డి గారికి నా ఓపెన్ ఛాలెంజ్ ఏమిటంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు టీవీలో చర్చకు రమ్మంటే ముంబైలో నా పనులు మానుకొని వస్తా... టైమ్, ప్లేస్ మీరే చెప్పండి సార్ అని వర్మ పేర్కొన్నారు.

సోమిరెడ్డి! టీచర్.. సూపర్, ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలి

సోమిరెడ్డి! టీచర్.. సూపర్, ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలి

మినిస్టర్ సోమిరెడ్డి: ఎన్టీఆర్ పై వర్మ తో బహిరంగ చర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్ళడు.

వర్మ: మీరు మీ పాలేరు కూడా చర్చకి రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలిసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్న ఎన్టీఆర్ గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరొప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్.

మినిస్టర్: వర్మ తెలివితేటలు ఏదైనా ఉంటే లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా సక్సెస్ పై చూపమను.
వర్మ: వావ్ ఏం జీనియస్ సార్ మీరు. మీరు చెప్పేవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు. సోమి టీచర్ గారు, కని విని ఎరుగని గొప్ప పాఠం చెప్పారు. దయచేసి ఫీజు ఏ అడ్రెస్స్ కి పంపాలో చెప్పండి ?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Varma posts Somi Reddy comments my replies
Please Wait while comments are loading...