వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి ముహూర్తం, వేదిక ఫిక్స్..!!

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం అతి తొందర్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. వివాహ ముహూర్తంతో పాటుగా వేదిక పైన స్పష్టత వచ్చింది. విశాఖ వేదిక గురించి ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అటు పవన్ కల్యాణ్ సైతం వరుణ్ తేజ్ వివాహం కోసం తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ పూర్తిగా సెలబ్రేషన్స్ జోష్ లో ఉంది.

ఈ నెలలోనే వివాహం : వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ ముహూర్తం ఖరారైంది. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్దం జరిగింది. ఆ తరువాత ఇద్దరూ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో మిస్టర్ సినిమ షూటింగ్ ఇటలీలోనే జరిగింది.

Varun Tej and Lavanya Tripathi to tie the knot in November 1 as reports

ఆ సమయంలోనే వీళ్ల లవ్ ట్రాక్ నడిచింది. అయితే ఆ సినిమా సక్సెస్‌ కాకపోయినప్పటికి వీళ్లిద్దరి ప్రేమ మాత్రం ఏడడుగుల వరకు వెళ్లింది. ప్పుడు వరుణ్ తేజ్ - లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఈ ఫొటోలు ఇప్పుడు మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.

ఇటలీ వేదికగా కల్యాణం : వరుణ్ తేజ్ వివాహం ఈ నెల చివరి వారంలో నే జరగనుందని మెగా క్యాంపు నుంచి సమాచారం అందుతోంది. అయితే, వివాహం మాత్రం ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన ఉపాసన తాము టస్కనీ వచ్చేసామని రాసుకొచ్చారు. ఇక, పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 17న ఇటలీ వెళ్లనున్నారు. 26న తిరిగి వస్తారని తెలుస్తోంది.

Varun Tej and Lavanya Tripathi to tie the knot in November 1 as reports

దీంతో, ఈ నెలలోనే వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. వివాహం ఇటలీలో జరిగినా..హైదరాబాద్ తో పాటుగా డెహ్రాడూన్ లోనూ రిసిప్షెన్ ఏర్పాటు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో పెరగటం తో అక్కడ కూడా రిసిప్షెన్ కు నిర్ణయించారు.

మెగా ఇంట సెలబ్రేషన్స్ : ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా..అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వేడకల్లో ఉన్నారు. ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతిగాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్ అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక అక్కడే వరుణ్, లావణ్య వివాహం జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, తాజా ఫొటోలు మెగా ఫ్యాన్స్ మధ్య వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+