Varun Tej - Lavanya Wedding: "మెగా" సెలబ్రేషన్స్ - అన్నీ ప్రత్యేకమే, చూడాల్సిందే..!!

మెగా హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి - సురేఖ తమ మనవరాలితో పెళ్లిలో సందడి చేసారు. ఈ వివాహంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపించాయి.

మెగా హీరోల సందడి: ఒక కారులో వరుణ్ తేజ్ ను మండపం దగ్గరకు తీసుకు రాగా... వీటితో పాటు విందు భోజనాలు ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. మెగా హీరోలు అందరూ ఒకే వేదిక మీదకు రావటంతో ప్రత్యేక సందడి వాతావరణం కనిపించింది.

Varun Tej - Lavanya Wedding : Mega Heros Celebrations, Photos goes viral

వరుడు వరుణ్ తేజ్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకకు ధరించారు. ఎరుపు రంగు కాంచీపురం చీరను లావణ్య ధరించారు. వివాహ మండపం వద్దకు వరుణ్ తేజ్ గ్రాండ్‍గా ఓ వింటేజ్ కన్వర్టబుల్ కారులో వచ్చారు.

పెళ్లి ఫొటోలు వైరల్: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ సహా మెగా, అల్లు హీరోలందరూ ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. యంగ్ హీరో నితిన్ కూడా సతీసమేతంగా ఈ వివాహానికి వెళ్లారు. అక్టోబర్ 30న మొదలైన ఈ పెళ్లి వేడుకలలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. మరోవైపు పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వచ్చే వీడియోలు మాత్రం వైరల్ గా మారాయి.

ఒక కారులో వరుణ్ తేజ్ ను మండపం దగ్గరకు తీసుకు రాగా... వీటితో పాటు విందు భోజనాలు ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ నెల 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ వేదికగా వివాహ రిసిప్షెన్ ఏర్పాటు చేసారు. వేడుకకు సినీ, పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందిన చాలా మంది అతిథులు హాజరుకానున్నారు.

Varun Tej - Lavanya Wedding : Mega Heros Celebrations, Photos goes viral

సంప్రదాయ దుస్తుల్లో మెగాస్టార్: ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నేడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతంలో వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ సినిమా సమయంలో వీరి ప్రేమ మొదలైంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అంతరిక్షం సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకులేకపోయింది.

దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. వివాహ సమయంలో రామ్ చరణ్ - ఉపాసన గారాల పట్టి క్లీంకారను ఎత్తుకొని చిరంజీవి - సురేఖ దంపతులు ఆనందపడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సంప్రదాయ దుస్తుల్లో చిరంజీవి దంపతులు మనవరాలిని ఒల్లో కూర్చోబెట్టుకొని ఆడిస్తుండటం కనిపించింి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+