వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జగన్ పబ్జి ఆడతాడా? ఓ సన్నాసి దేవినేని.. చెత్తవాగుడు వాగకు’

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవినేనికి మతిభ్రమించిందని దుయ్యబట్టారు.

జగన్ పబ్జి ఆడతాడా?

జగన్ పబ్జి ఆడతాడా?

‘దేవినేని ఉమా ఓ సన్నాసి.. సీఎం పబ్జి అడతాడాని చెత్తవాగుడు వాగుతావా... సీఎం ట్యాబ్ చూడరు.. సెల్‌ఫోన్ వాడారు.. ఈ విషయం అడ్డగాడిద అయిన దేవినేని ఉమాకి తెలియదు... సీఎం అంటే కనీసం మర్యాద తెలియదు.. మీ నాయకుడికి ఆయన నిలుచున్న నియోజకవర్గం పేరుకుడా పలకలేడు...' అంటూ వసంత కృష్ణప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ‘మిమ్మల్నే ప్రజలు కరెంట్ తీగలు తీగల మీద వేలాడు తీశారు. తెలుగు దేశం పార్టి కాస్తా. తెగులు పట్టిన పార్టీ గా మారింది. మీ వదినను తడిగుడ్డతో చంపిన వాడివి... స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యాక వైజాగ్‌లో బెడ్లు రిజర్యూ చేయాలి మీ అందరికి..' అంటూ ఎద్దేవా చేశారు ఈ వైసీపీ ఎమ్మెల్యే.

పిచ్చివాగుడు మానకపోతే..

పిచ్చివాగుడు మానకపోతే..

‘2900 మందికి గొల్లపూడిలో ఇళ్ల స్థలాలు కేటాయించాము.. ఇన్నాళ్లు నీవు ఎమ్మెల్యేగా ఉండి ఒక్కరికి ఇళ్లస్థలం ఇచ్చావా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు పేరు నిలబెట్టుకునే అవసరం నీ మీదే ఉంది? సీఎంపై ఇలాంటి పిచ్చి వాగుడు మానక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని దేవినేని ఉమాను వసంత హెచ్చరించారు.

మేము టీడీపీ నేతల్లా కాదు..

మేము టీడీపీ నేతల్లా కాదు..

టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నల మాదిరిగా తాము సంస్కారహీనంగా మాట్లాడలేమని అన్నారు. ఏపీ సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని అర్థమైన టీడీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విమర్శలు చేయగలమని.. కానీ తమకు సంస్కారం ఉందని వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.

English summary
YSRCP MLA Vasantha Krishna Prasad slams devineni umamaheswara rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X