నల్లధనం: బాబుపై వాసిరెడ్డి పద్మ హసన్ అలీ అస్త్రం

హసన్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మరణించిన నాయకుడు కాదని జీవించి ఉన్న వ్యక్తి అని కూడా హసన్ అలీ ఖాన్ చెప్పినట్లు ఆమె తెలిపారు.
వేల కోట్ల రూపాయలు ఆ మాజీ ముఖ్యమంత్రి తరలించినట్లు హసన్ అలీ నత డైరీలో రాసుకున్నారని, కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కుంభకోణం కేసులో పూణే స్టడ్ ఫామ్ యజమాని హసన్ అలీ ఖాన్‌ను అప్పట్లో అరెస్టు చేశారని, 2011లో ఈ విషయాన్ని జాతీయ పత్రికలు రాశాయని ఆమె చెప్పారు.
హసన్ అలీ చెప్పిన విషయాలపై విచారణ జరిపించాలని ఆమె ఎన్డియె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికి తీస్తే రైతుల రుణాలు ఒక్కసారి కాదు, పదిసార్లు రద్దు చేయవచ్చునని పద్మ అన్నారు. ఎన్డియెలో భాగస్వామి అనే కారణంతో చంద్రబాబును వదిలేయవద్దని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications