'కేసుల విషయంలో జగన్ ఎప్పుడూ భయపడలేదు, బాబే కాళ్లు పట్టుకున్నారు'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం మండిపడ్డారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం మండిపడ్డారు.
కేసుల విషయంలో జగన్ ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఆయన ఎవరికీ లొంగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో కేంద్రం కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు.

జనంలో జగన్‌కు ఉన్న ఆదరణ చూసి ఎల్లో మీడియా, చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. జగన్‌ను ఎదుర్కోవడం చేతకాక చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారన్నారు. జగన్ కంపెనీలపై ఈడీ దాడులు అంటూ ఒక పత్రిక తప్పుడు కథనాలు రాసిందన్నారు.
అది సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్ అంటూ బురద జల్లే ప్రయత్నం అన్నారు. సీబీఐ, ఈడీ ఏం చేసినా జగన్‌కు అది అంటగడతారా అని నిలదీశారు. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన ఎల్లో మీడియా జగన్‌ను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications