చంద్రబాబు స్టే తెచ్చుకోవచ్చు కానీ: వైసిపి పాతదైన 'కొత్త' రాగం
విజయవాడ: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్టే వచ్చిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాతదైన కొత్త రాగం అందుకుంది. ప్రజా కోర్టులో చంద్రబాబు దోషేనని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం నాడు అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. శుక్రవారం నాడు ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది.

ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ స్పందించారు. కోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికీ ప్రజా కోర్టులో చంద్రబాబు మాత్రం దోషేనని చెప్పారు. కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవచ్చునేమో కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఆయన ఓడిపోయారని చెప్పారు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో తెలుసునని చెప్పారు. కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి మాటలను చూస్తుంటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని కనిపిస్తోందన్నారు. హోదా సాధించకపోతే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications