వైసీపీకి కీలక నేత గుడ్ బై - అదే బాటలో..!!
వైసీపీని ముఖ్య నేతలు వీడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొందరు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రతిపక్షం లో ఉన్న సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించి.. అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పదవి నిర్వహించిన నేత పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఆ నేత బాటలోనే మరి కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.
వైసీపీని వీడేందుకు మరో ముఖ్యనేత సిద్దమయ్యారు. మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రియాశీలకంగా పని చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసారు. తాజా ఎన్నికల సమయంలో జగ్గయ్య పేట సీటు ఆశించారు. కానీ, దక్క లేదు. అప్పటి నుంచి తన పదవికి రాజీనామా చేసిన పద్మ..రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిన తరువాత ఆమె పార్టీ వీడుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

తనకు లేదా తన భర్తకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఎన్నికల సమయంలో పద్మ మాజీ సీఎం జగన్ పైన ఒత్తిడి తెచ్చారు. వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె వైసీపీలో చేరారు. వైసీపీలోనూ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ వీడాలని నిర్ణయించటంతో జనసేన లో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. పవన్ తో పాటుగా జనసేన ముఖ్యులతో వాసిరెడ్డి పద్మకు ఉన్న పరిచయాలతో అటు వైపే అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఈ లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే సామినేని ఉదయభాను, బాలినేని జనసేనలో చేరారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన రావు టీడీపీ కండువా కప్పుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. ఇక, ఇప్పుడు వైసీపీలోని మరో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ వీడుతున్నారనే ప్రచారం మొదలైంది.












Click it and Unblock the Notifications