సిఎం పదవిపై డిఎస్ వైరాగ్యం: వాస్తు మార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెసు శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ తన ఇంటికి వాస్తుమార్పులు చేయించారు.
యుద్ధ ప్రాతిపదికన ఈ మార్పులు చేయించారు. ఇంటి వెనుక భాగంలో బరువుగా ఉండే నిర్మాణం, గేట్ మూయించడం వంటివి చేశారు.
డిఎస్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి పలు మార్పులు చేశారు. వీధి శూల ఉండడంతో వాస్తుకు అనుగుణంగా ముందు భాగాన ప్రహరీ గేటును తూర్పు వైపు జరిపారు. పశ్చిమాన గోడ ఎత్తు చేయడంతోపాటు ఇంట్లోనూ మార్పులు చేశారు.

వాస్తు దోషం
రాష్ట్ర విభజన, ఎన్నికల వేళ పలువురు నేతలు తమ గ్రహ, గృహ దోషాలపై దృష్టి సారిస్తున్నారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి పలు మార్పులు చేశారు.

వాస్తు మార్పులు
వీధి శూల ఉండడంతో వాస్తుకు అనుగుణంగా ముందు భాగాన ప్రహరీ గేటును తూర్పు వైపు జరిపారు. పశ్చిమాన గోడ ఎత్తు చేయడంతోపాటు ఇంట్లోనూ మార్పులు చేశారు.

హైదరాబాద్ ఇళ్లు
గతంలో తెరాస అధ్యక్షులు కెసిఆర్ సైతం హోమం నిర్వహించారు. టిడిపి కార్యాలయానికి కూడా ఇదివరకు పలు మార్లు వాస్తు మార్పులు చేశారు. సచివాలయంలో కిరణ్ స్థానంతో సహా, మంత్రులూ తమ చాంబర్లలో మార్పులు చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. సచివాలయ ద్వారాన్ని కూడా వాస్తు ప్రకారం మార్చినట్లు చెబుతుంటారు.

డి శ్రీనివాస్
కాగా, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమనేది దైవాధీనమని, ఆ పదవి దక్కడం మన చేతిలోనిది కాదని, పైన భగవంతుడున్నారని, అన్నీ ఆయన చూసుకుంటారని డి శ్రీనివాస్ ఆదివారం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications