వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు తీపికబురు.. నేడు వారి ఖాతాల్లో రూ.200 కోట్ల పరిహారం!

వెలిగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్ జలాశయం భూ నిర్వాసితులకు మరో తీపి కబురు చెప్పింది కూటమి ప్రభుత్వం . భూ నిర్వాసితులకు సంబంధించిన సహాయ పునరావాస ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది ఈనెలాఖరులోగా జలాశయానికి కృష్ణ జలాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో ముంపు గ్రామాల ప్రజలకు పరిహారాన్ని అందిస్తోంది.

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్

ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాసం కింద ప్రభుత్వం మొత్తం 905 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలోని 2565 కుటుంబాలకు 318 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాలలో జమ చేశారు.నేడు మరో 1,600 కుటుంబాలకు రూ.200 కోట్ల మేర పరిహారాన్ని పంపిణీ చేయడానికి నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది రైతులకు ఈ మేరకు స్వయంగా చెక్కులు అందజేస్తారు.

Veligonda project Relief for Nallamalasagar displaced families 200 crore to 1 600 families today

ముంపు గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వ అండ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అందుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అందిస్తామని చెప్పిన సహాయ పునరావాస ప్యాకేజీ అందిస్తామని ఆయన అన్నారు. నేడు మరో 2,865 కుటుంబాల బిల్లులు కూడా అప్‌లోడ్ అయ్యాయి. మిగిలిన వారికి కూడా ప్రక్రియ వేగంగా సాగుతోంది.

ఈ జిలాశయం పూర్తయితే సాగునీరు, తాగునీరు

ఈ జలాశయం పూర్తయితే సుమారు 15 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 11 గ్రామాలు మునిగిపోతాయి. దీంతో 7,321 కుటుంబాలు తమ ఊళ్లను వీడాల్సి వస్తోంది. వీరిలో 3,961 కుటుంబాలకు ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్ల స్థలాలతో పాటు కులాల వారీగా ప్యాకేజీ ఎస్టీలకు రూ.13.01 లక్షలు, ఎస్సీలకు రూ.12.76 లక్షలు, బీసీలకు రూ.11.76 లక్షలు అందుతుంది.

నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. చంపింది ఆమె స్కూల్ విద్యార్థులే!
నల్గొండ ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. చంపింది ఆమె స్కూల్ విద్యార్థులే!

ఈ ప్రాజెక్ట్ తో లబ్ది వీరికే

మిగతా 3,360 కుటుంబాలు వన్ టైం సెటిల్‌మెంట్‌గా రూ.12.50 లక్షలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నల్లమల సాగర్ జలాశయం పూర్తిగా నిండితే ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాలోని తీవ్ర కరువు మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు లబ్ధి చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+