విగ్రహాల మీద టీడిపికి ఎందుకు ఆగ్రహం..! వైయస్ విగ్రహాన్ని కూల్చిన చోటే ప్రతిష్టిస్థామన్న వైసీపి..!!
విజయవాడ/హైదరాబాద్ : అమరావతిలో విగ్రహాల రాజకీయం నడుస్తోంది. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రామలింగేశ్వర నగర్ స్క్రూబ్రిడ్జి వద్ద వంగవీటి మోహనరంగా ఉద్యానవనాన్ని, విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పార్కును తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు మరలా పార్కును ప్రారంభించి.. మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Recommended Video


పేద ప్రజల కోసం రంగా చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుడా గత టీడిపి ప్రభుత్వం విగ్రహాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిందని చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్దంగా ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించినప్పుడు, నిబంధనలకు లోబడి ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఎందుకు తొలంగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications