వేములవాడ: ముక్కోణపు పోటీలో రమేష్ బాబు

Vemulawada: Chennamaneni Ramesh Babu in traingle fight
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి, సిట్టింగ్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు కరీంగనర్ జిల్లా వేములవాడలో ముక్కోణపు పోటీలో చిక్కుకున్నారు. ఆయన విజయానికి హోరాహోరీ పోరాడాల్సి ఉంటుంది. రమేష్ బాబు తెరాస నుంచి ముడోసారి బరిలో దిగుతుండగా బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు తొలిసారిగా వేములవాడ నియోజకవర్గం ఉంచి పోటీ పడుతున్నారు.

రమేష్ బాబు, ఆదిశ్రీనివాస్, బొమ్మ వెంకన్నల ముక్కోణపు పోటీ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో రమేష్ బాబు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఆది శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. వేములవాడ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొమ్మ వెంకటేశ్వర్లుకు స్థానిక నేతల నుంచి సహకారం అందడం లేదు.

సీట్ల కేటాయింపుల నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెసు నేతలు అసమ్మతిరాగం ఆలపిస్తున్నారు. బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడించి, సహాయానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి సెగలను చల్చార్చేందుకు మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, ఎంపి పొన్నం ప్రభాకర్, డిసిసి చీఫ్ కొండూరి ప్రయత్నాలు చేస్తున్నారు.

అసంతృప్తులను బుజ్జగించి నియోజకవర్గంలో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద, వేములవాడలో ఈసారి అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+