Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరాసపై వెంకయ్య నిప్పులు, పార్టీ పేరుపై కిరణ్ వివరణ

హైదరాబాద్/అనంతపురం: తెలంగాణ రాష్ట్ర సమితి పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ గీడీ లేడు అని కెసిఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూనే.. మోడీ మద్దతు కావాలని అంటే ఎలా సాధ్యమని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు.

తెరాస నేతలు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెరాస నేతల తీరును తమ పార్టీ వారు ప్రశ్నించడం లేదని, తమ పార్టీ ఏర్పాటు చేసుకున్న పొత్తులపై తాము ఆలోచించుకోగలమన్నారు. తెరాస పార్టీ నేతలు ఆ పార్టీ గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

Venkaiah fires at TRS

కాంగ్రెసు పార్టీ విముక్తిని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తు వల్ల దేశంలో మోడీ, రాష్ట్రంలో టిడిపికి అధికారం వస్తుందన్నారు. ఎనిమిది అంశాల్లో యూపిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు సహకరించుకుంటాయన్నారు. ఎన్డీయే కోసం కాదు.. దేశం కోసమే మోడీని గెలిపించాలన్నారు.

పుట్టపర్తిలో కిరణ్ సభ

జై సమైక్యాంధ్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టమన్నారు. ప్రజల నినాదాన్నే తాను పార్టీ పేరుగా ఎంచుకున్నానని చెప్పారు. తాను, చంద్రబాబు, జగన్ మీ ముందుకు వస్తున్నామని... సరైన వారిని ఎన్నికోవాలన్నారు. తాను సమైక్యం కోసం సిఎం పదవిని వదులుకున్నట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+