Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సురేశ్ ప్రభు ఎంపిక ఏపీకి మేలు: టీడీపీకి కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్య

అమరావతి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుని ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు హార్షం వ్యక్తం చేశారు. సురేశ్ ప్రభు ఎంపిక ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

మిత్రధర్మంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సురేశ్ ప్రభుని ఎంపిక చేసినందుకు గాను టీడీపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఇందులో భాగంగా సోమవారం రాత్రి 9.15 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ విమాశ్రయంలో ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సురేశ్ ప్రభు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి వీటిలో మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి.

Venkaiah naidu praise tdp over giving rajya sabha seat to suresh prabhu

అయితే వైసీపీకి దక్కనున్న ఒక్క సీటుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభ్యర్ధిత్వాన్ని వైయస్ జగన్ ఖరారు చేయడంతో నామినేషన్ కూడా దాఖలు చేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, టీడీపీ కూడా తన అభ్యర్ధులను ఖరారు చేసింది.

టీడీపీకి దక్కే మూడు సీట్లలో మిత్ర ధర్మంలో భాగంగా ఒక సీటుని బీజేపీకి కేటాయించింది. కేంద్రం రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు కోరగా అందుకు చంద్రబాబు అంగీకరించారు. ఇక మిగిలిన రెండు సీట్లలో టీడీపీ తరుపున రాజ్యసభ అభ్యర్ధులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లను ఖరారు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+