ఫ్రాన్స్‌లో వెంకయ్యకు చేదు అనుభవం: సారీ చెప్పిన ఫ్రాన్స్ మంత్రి
హైదరాబాద్: ఫ్రాన్స్ పర్యనటలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఓ విమానయాన కంపెనీ చేసిన నిర్వాకం వల్ల ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ నగరంలో జరిగిన 22వ అంతర్జాతీయ ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్‌సిస్టమ్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు.

ప్రాన్స్ విమానంలో ఆయన ఇందుకోసం అక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, విమానంలో ఆయన కోసం రిజర్వు చేసిన టికెట్‌ను ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు 11వ గంటలో రద్దు చేశారు. దీంతో భారీ వర్షంలో దాదాపు 600 కిలో మీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి బోర్డెక్స్‌లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
దీంతో ఈ సంఘటనపై ఫ్రాన్స్ రవాణా మంత్రి అలెస్ స్పందించి వెంకయ్యకు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Air France's irresponsible behaviour.Cancels confirmed booking at d 11th hour.Forced 2 drive down 600 kms over night in heavy downpour (1/3)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 5, 2015 to reach Bordeaux for International Conference on Intelligent Transport Systems. (2/3)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 5, 2015 HE Mr Alain Vidales, Minister for Transport & Shipping apologized 4 d inconvenience caused and said would get the matter inquired into (3/3)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 5, 2015 











Click it and Unblock the Notifications