టివి యాంకర్‌తో ఎఫైర్: డిగ్గీకి వెంకయ్య గ్రీటింగ్స్ చురక!
హైదరాబాద్: వృద్ధాప్యంలోనూ వివాహం చేసుకోడానికి ఉవ్విళ్లూరుతున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు తనదైన వ్యంగ్య ధోరణిలో శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం నగరానికి వచ్చిన వెంకయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దిగ్విజయ్ వివాహం గురించి పలువురు ప్రస్తావించగా ఆయన తీవ్రంగా స్పందించారు.

పెళ్లి బిజీలో ఉన్న ఆయనను ప్రస్తుతం కదిలించడం అంత మర్యాదగా ఉండదేమోనని నవ్వుతూ కొట్టిపారేశారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ గురించి మాట్లాడే నైతికత దిగ్విజయ్‌కి లేదని విమర్శించారు. ఒకదశలో వెంకయ్య తీవ్రంగా స్పందిస్తూ దిగ్విజయ్ ఎంతటి సీనియర్ నేత అయినా అంతటి పనికి మాలిన వ్యక్తి మరొకరుండరంటూ విరుచుకుపడ్డారు.
సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి మోడీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందనే వాస్తవాన్ని సీమాంధ్ర ప్రాంత ప్రజలంతా గుర్తించారన్నారు. బిజెపి, టిడిపిలను తోడుదొంగలంటూ పేర్కొన్న సోనియా... ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న ముస్లింలు, క్రైస్తవ మైనారిటీలను లౌకికవాద మంత్రంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నారు.












Click it and Unblock the Notifications