నాటి బంధనాలు నేడు లేవు - తిరిగి కొనసాగుతాను : వెంకయ్య క్లారిటీ..!!

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య తన రోల్ ఏంటో స్పష్టం చేసారు. దాదాపు అయిదు దశాబ్దాల కాలం రాజకీయంగా జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా వ్యహరించిన తాను ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతిగా ఎటా ఉండాలనుకుంటుందీ వివరించారు. రాజ్యసభలో వెంకయ్య వీడ్కోలు చర్చ సమయంలో ప్రధాని సైతం వెంకయ్య రాజకీయాలకు దూరం అయ్యారు కానీ, ప్రజలతో కాదని వ్యాఖ్యానించారు. వెంకయ్య వాక్చాతుర్యం..అనుభవం గురించి ప్రశంసించారు.

ఇప్పుడు ఆ బంధనాలు లేవంటూ

ఇప్పుడు ఆ బంధనాలు లేవంటూ

ఇక, పదవీ విరమణ చేసిన తరువాత హైదరాబాద్ కేంద్రంగా వెంకయ్యతో రాజకీయ, వ్యాపార, సినీ, కళ రంగాలలోని ఆయన మిత్రులు, ప్రముఖుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వెంకయ్య తన మనససులో మాట బయట పెట్టారు. తాను రాజ్యంగ బద్దమైన ఉన్నత పదవిలో కొనసాగానని..అప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసారు. వాటికి కట్టుబడి ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆ బంధనాలు లేవని..తిరిగి ప్రజా జీవనంలో కొనసాగుతానని వెంకయ్య స్పష్టం చేసారు. తన అభిప్రాయాలను ఎటువంటి మోహమాటం లేకుండా వ్యక్తం చేస్తానని వెల్లడించారు.

అలా రావటం మంచిది కాదు

అలా రావటం మంచిది కాదు

రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగిన తర్వాత రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని..పరోక్షంగా తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో ఉంటూ..తనకు తెలిసిన అంశాల పైన ఎప్పటికప్పుడు అవసరమైన వారితో పంచుకొనే ప్రయత్నం చేస్తానన్నారు. తాను రైతులు..యువతకు చెప్పటమే కాకుండా, వారి నుంచి నేర్చుకొనేవి ఉంటాయని వివరించారు. స్నేహం ఎంతో విలువైందని వ్యాఖ్యానించిన వెంకయ్య..ఎప్పుడూ దానిని కాపాడుకోవాలని సూచించారు. అన్నింటి కంటే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పని చేయటం తనకు దక్కిన అవకాశాల్లో అతి పెద్ద అవకాశంగా అభివర్ణించారు.

వ్యక్తిగత దూషణలు వద్దంటూ

వ్యక్తిగత దూషణలు వద్దంటూ

తాను చట్ట సభలో సభ్యుడిగా ఉన్న సమయంలో ఎంతో మందితో కలిసే అవకాశం కలిగిందన్నారు. వారి నుంచి ఎంతో కొంత నేర్చుకొనే వెసులుబాటు ఏర్పడందని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయకపోతే రాజకీయంగా వెనుకబడి పోతామేమో, వార్తల్లో కనిపించవేమోనన్న భావనతో కొంతమంది ఉందని వ్యాఖ్యానించారు. ఈ ధోరణి పైన వెంకయ్య ఆందోళన వ్యక్తం చేసారు.

సభల్లో ఏ అంశం పైన అయినా చర్చలు వాడీ వేడిగా జరగాలే కానీ, వ్యక్తిగత దూషణతో సరి కాదన్నారు. రాజకీయ నేతలు ఆదర్శంగా ఉండాని వెంకయ్య సూచించారు. దీంతో..వెంకయ్య నాయుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదనే క్లారిటీ ఇచ్చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+