వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!

అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నా కూడా పట్టించుకునే స్థితిలో లేనట్టు కనిపిస్తోంది. అమరావతిలో తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు టీడీపీ సర్కారు నిర్ణయాన్ని సవరించేస్తున్నారు వైసిపి నేతలు. తిరుమల వెంకన్న ఆలయాల నిర్మాణం, వాటి నిర్వహణకు వెచ్చిస్తున్న సొమ్ము సర్కారుది కాదు. అది వడ్డీకాసుల వాడి సొమ్ము. దానిపైనా పరిమితులు విధిస్తున్న జగన్ నిర్ణయం చూస్తుంటే, నిజంగానే వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

వెంకన్న ఆలయ నిర్మాణానికి నిధుల కుదింపు..! సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!!

వెంకన్న ఆలయ నిర్మాణానికి నిధుల కుదింపు..! సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!!

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణానికి పరిమితులు విధిస్తున్నారు. తిరుమల వెంకన్న సొత్తు అంటే, అది భక్తులు స్వామివారికి ఇచ్చిన ముడుపులు. అలాంటి ప్రభుత్వ ఖజానా నుంచి తీసిస్తున్నట్లు వ్యవహరిస్తున్న జగన్ వైఖరి చూస్తుంటే, వెంకన్న భక్తులకు నిజంగానే అసంతృప్తి కలుతున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో రూ.130 కోట్లతో శ్రీవేంకటేశ్వరుడి గుడి నిర్మాణానికి పూనుకుంది గత ప్రభుత్వం. జనమంతా కూడా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నేపథ్యంలో గుడి నిర్మాణం శరవేగంగానే సాగుతోంది.

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు..! నిధుల్లో కోత వద్దంటున్న ప్రజలు..!!

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు..! నిధుల్లో కోత వద్దంటున్న ప్రజలు..!!

అయితే తాను సీఎం అయిన వెంటనే ప్రతి నిర్ణయంపైన లోతుగా సమీక్ష చేస్తున్న జగన్, తాజాగా వెంకన్న ఆలయానికి 130 కోట్ల రూపాయలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 30 కోట్ల రూపాయలతో సరిపుచ్చేయండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా వెంకన్న ఆలయ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సొమ్ము వాడటం లేదు కదా. తిరుమల వెంకన్నకు భక్తిప్రపత్తులతో భక్తులు అందజేసిన విరాళాలతోనే కడుతున్నారు కదా. మరి సర్కారు సొమ్మేదో దుబారా అయినట్టుగా భావిస్తున్న జగన్, ఆలయ ఖర్చును అమాంతం తగ్గించేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వెంకన్న సొమ్ములపై ఎందుకు ఆక్షలు..! రిచ్ గా ఉంగాలంటున్న భక్తులు..!!

వెంకన్న సొమ్ములపై ఎందుకు ఆక్షలు..! రిచ్ గా ఉంగాలంటున్న భక్తులు..!!

అంతే కాకుండా తన సొంత రాష్ట్రం అమరావతిలో వెంకన్న ఆలయానికి పరిమితులు విధిస్తున్న జగన్, తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ఖర్చుతో వెంకన్న ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. ఇక్కడ అమరావతిలో వెంకన్న ఆలయానికి పరిమితులు విధిస్తుంటే, అక్కడెక్కడో చెన్నైలో మాత్రం అదే వెంకన్నకు భారీ ఆలయం కడతామని వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన చూస్తుంటే, తెలుగు ప్రజలు అవాక్కవుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.

విశాలమైన గుడులు ఉంటే నష్టమేంటి..? ప్రభుత్వం పునరాలోచించాలంటున్న జనాలు..!!

విశాలమైన గుడులు ఉంటే నష్టమేంటి..? ప్రభుత్వం పునరాలోచించాలంటున్న జనాలు..!!

అమరావతి ప్రాంతంలో తిరుమల వంటి ప్రాశస్త్యం కలిగిన మరో ఆలయం వెలిస్తే ప్రభుత్వానికి సమస్యేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త నిర్ణయాలతో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలని, పాత నిర్ణయాలను సవరిస్తే మంచి ముఖ్యమంత్రి కాలేరనే అభిప్రాయాలు ప్రజలనుండి వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణంపై పరిమితులు విధిస్తున్న వైనంపై ఇప్పుడు నిజంగానే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరహా నిర్ణయాలపై వెనక్కు తగ్గకుంటే, వెంకన్న భక్తుల ఆగ్రహావేశాలకు వైసీపి ప్రభుత్వం గురికాక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+