మంత్రి కాలేదని మనస్తాపం: వెంకట్రావ్‌కు గుండెపోటు

విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలపడంతో.. కాగిత వెంకట్రావ్‌ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
బిపి, షుగర్ ఉన్న ఆయన ఆదివారం ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈసారి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్న ఆయన ఆశలు ఫలించకపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు.
బిసి గౌడ సామాజిక వర్గానికి చెందిన కాగిత వెంకట్రావ్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో చీఫ్ విప్‌గా పనిచేశారు. అప్పట్లోనే మంత్రి పదవి వస్తుందనుకున్నారు. అప్పుడు, ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కాగిత వెంకట్రావ్ కొంత ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications