• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంశీకి వ్యతిరేకంగా - ఒక్కటైన ఆ ఇద్దరు : సహకరించేదే లేదు - ఆదేశాలు బే ఖాతర్..!!

|
Google Oneindia TeluguNews

గన్నవరం లో అధికార వైసీపీలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా దుట్టా .. వెంకటరావు ఒక్కటయ్యారు. తాము అసలైన వైసీపీ నేతలమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్ధినని చెప్పటం వీరికి రుచించటం లేదు. వంశీకి టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. వంశీ 2019 ఎన్నికల్లో అనైతికంగా గెలిచారంటూ యార్లగడ్డ వెంకటరావు ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు తనకు చేతకావటంటూ వ్యాఖ్యానించారు. తాను నియోజకవర్గంలో కార్యకర్తల కోసం పని చేసానని చెప్పుకొచ్చారు.

వంశీకి వెంకటరావు కౌంటర్

వంశీకి వెంకటరావు కౌంటర్


రాజకీయాల్లో ఉన్న వారికి హుందాతనం ఉండాలని..తాము వంశీ తరహాలో మాట్లాడలేమని చెప్పుకొచ్చారు. తనకు సీఎం జగన్‌ మద్దతు ఉందన్న వంశీ.. అప్పుడప్పుడు వచ్చేపోయే వారి గురించి తాను పట్టించుకోనన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలో జగన్‌ నిర్ణయిస్తారన్నారు. మట్టి తవ్వకాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పని చేయమన్నారు.. చేస్తున్నా. మిగతా వారి గురించి పార్టీ చూసుకుంటుందని వంశీ చెప్పుకొచ్చారు. తన మీద ఏమైనా బాధ ఉంటే వారు జగన్‌ దగ్గర చెప్పుకుంటారన్నారు. పిచ్చి కామెంట్లు అన్నీ అనవసరమని వ్యాఖ్యానించారు.

వంశీ గెలుపు అనైతికం

వంశీ గెలుపు అనైతికం


తాను గెలిచినా ఓడిపోయినా గన్నవరంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక, ఈరోజు దుట్టాకు చెందిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరావు తాను పార్టీ కోసం పని చేసానని వివరించారు. సీఎం జగన్ చెప్పినా..తాము వంశీకి సహకరించేది లేదని స్పష్టం చేసారు. గన్నవరంలో తన కారణంగానే ఎంపీ బాలశౌరికి మెజార్టీ వచ్చిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ను వంశీ పరుషంగా మాట్లాడిన అంశాలను వెంకటరావు ప్రస్తావించారు. వల్లభనేని వంశీ తమ పార్టీలో ఉన్నా జగన్‌ తనకే టికెట్‌ ఇస్తారని నమ్మకం ఉందని వెంకట్రావు చెప్పుకొచ్చారు. గన్నవరం గడ్డ తనను ఆదిరించిందని..వంశీ బెదిరింపులకు తాను భయపడేది లేదని వెంకటరావు స్పష్టం చేసారు.

వంశీకి సహకరించేది లేదని స్పష్టీకరణ

వంశీకి సహకరించేది లేదని స్పష్టీకరణ


అయితే, ఇప్పటికే సీఎం జగన్ తో సహా పార్టీ అధినాయకత్వం గన్నవరంలో కలిసి పని చేసుకోవాలని సూచించినా.. నేతల మధ్య సయోధ్య సాధ్యం కావటం లేదు. మీడియా ముందుకు వచ్చి.. నువ్వా - నేనా అన్నట్లుగా ఒకరి పైన ఒకరు విరుచుకుపడుతున్నారు. పీక్ కు వెళ్లిన గన్నవరం వైసీపీ పోరు పైన ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. ఇప్పటికే ఇదే జిల్లాలోని మచిలీపట్నం లో ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి మధ్య వివాదంలో ఎవరూ మీడియాకు ఎక్కవద్దని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇప్పుడు గన్నవరంలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావటం లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం వివాదం హాట్ టాపిక్ గా మారుతోంది.

English summary
Internal war between Gannavaram YSRCP leaders creating new problems for YSRCP hi command, Venkata Rao annouce will not support Vamsi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X