IPL 2026: RCB ఓటమితో మారిన ప్లే ఆఫ్స్ లెక్కలు, ఈ టీంలకే ఛాన్స్..!!

IPL 2026 కీలక దశకు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అనూహ్యంగా మార్పు కనిపిస్తోంది. ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల పైన అంచనాలు మారుతున్నాయి. రెండో దశ లీగ్ లో పాయింట్ల పట్టికలో కింద వరుసలో ఉన్న జట్లు ఒక్క సారిగా పుంజుకున్నాయి. దీంతో, తిరుగులేదని భావించిన టాప్ టీంల కు వరుస షాక్ లు తగులుతున్నాయి. దీంతో.. ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ప్రస్తుత పాయింట్ల ఆధారంగా ప్లే ఆఫ్స్ చేరే జట్ల పైన స్పష్టత వస్తోంది.

ఐపీఎల్ 2026 టోర్నీ మరింత ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు ఖాయమని భావించిన జట్లు రెడ్ జోన్ లోకి వెళ్తున్నాయి. తాజాగా లక్నో చేతిలో ఆర్సీబీ ఓటమి తరువాత ఒక్క సారిగా లెక్కలు మారుతున్నాయి. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉండటంతో.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం అవుతుంది. అదే విధంగా పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు ఖచ్చితంగా గెలవాలి. ఇక, ఆర్సీబీ కి ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు ఖచ్చితంగా గెలవటంతో పాటుగా రన్ రేటును కాపాడుకుంటేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తారు. అదే విధంగా రాజస్థాన్ రాయల్స్ ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందులో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు ఛాన్స్ దక్కుతుంది. అయితే, గుజరాత్ సాధించే ఫలితాలు.. రన్ రేటు రాజస్థాన్ ప్లే ఆఫ్స్ పైన ప్రభావం చూపనుంది.

విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
ipl-2026-playoffs-race-heats-up-srh-pbks-lead-rcb-rr-gt-locked-in-fierce-battle-for-top-four

ప్లే ఆఫ్స్ కోసం ఈ జట్ల పోటా పోటీ

ఇక, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం 12 పాయింట్లతో కొనసాగుతోంది. కాగా, మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు గెలవటంతో పాటుగా మైనస్ లో ఉన్న రన్ రేటు(-0. 147) మెరుగు పర్చుకుంటే రాజస్థాన్ ను అధిగమించి ప్లే ఆఫ్స్ రేసులోకి వస్తారు. ఇక.. సీఎస్కే కు ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనుంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిస్తేనే ఛాన్స్ ఉంది. అందలోనూ భారీ రన్ రేట్ వచ్చే విధంగా ప్రత్యర్థులను కట్టడి చేస్తే రేసులో నిలుస్తారు. ఢిల్లీ కేపిటల్స్ మిగిలిన నాలుగు మ్యాచులు గెలవటంతో పాటుగా రన్ రేటు భారీ స్థాయిలో పెరిగితేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటారు. కేకేఆర్ మిగిలిన అయిదు మ్యాచుల్లో నాలుగు గెలవాల్సి ఉంటుంది. కాగా, మైనస్ రన్ రేటు వారికి ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టంగా మార్చుతోంది. ముంబాయి ఇండియన్స్ మిగిలిన నాలుగు మ్యాచులు గెలిచి 14 పాయింట్లకు చేరినా.. వారికి ప్లే ఆఫ్స్ ప్రస్తుత గణాంకాల మేరకు కష్టంగానే కనిపిస్తోంది. లక్నో టీంకు ఇంకా నాలుగు మ్యాచులు ఉన్నాయి. రన్ రేటు మైనస్ లో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచులు గెలుస్తూ.. భారీగా రన్ రేటు పెంచుకోగలిగితే.. ఇతర జట్ల గెలుపు - ఓటముల ఆధారంగా ప్లే ఆఫ్స్ అవకాశాల పైన స్పష్టత వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+