రేవంత్ కీలక ప్రకటన - కార్మికుల వేతనాలు భారీగా పెంపు.. ఎవరికి ఎంత..!!

ముఖ్యమంత్రి రేవంత్ కార్మికులకు భారీ శుభవార్త చెప్పారు. కొంత కాలంగా చేస్తున్న కసరత్తుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల వేతనాలు సవరిస్తూ నిర్ణయం ప్రకటన చేసారు. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థను జోనల్.. కేటగిరీలుగా విభజించారు. కేటగిరీల వారీగా వేతనాలను పెంచుతూ ఖరారు చేసారు. అనేక రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ఈ నిర్ణయం కారణంగా భారీగా లబ్ది కలగనుందని రేవంత్ స్పష్టం చేసారు.

తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. కార్మికుల కనీస వేతనాల పెంపు పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను సీఎం వెల్లడించారు. ఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు చేసేలా నిర్ణయించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కనీస వేతనాలు నిర్ణయించకపోవటం వలన 1.11 కోట్ల మంది నష్టపోయార ని.. కనీస వేతన పెంపు పై కేబినెట్ సబ్ కమిటీ అన్ని వర్గాలతో సంప్రదింపులు చేసి.. కీలక నివేదిక ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కేటగిరీలుగా విభజించింది. కార్మిక వేతనాలు నిర్ణయించేందుకు జోన్లను మూడుగా విభజించారు. జోన్ -1 మున్సిపల్ కార్పోరేషన్లు, జోన్ -2 మున్సిపాల్టీలు, జోన్ -3 గ్రామీణ ప్రాంతాలను ఖరారు చేసారు.

మోదీ కొత్త టీంలో తెలంగాణ నుంచి ఊహించని మార్పులు - ఇన్ .. అవుట్..!?
మోదీ కొత్త టీంలో తెలంగాణ నుంచి ఊహించని మార్పులు - ఇన్ .. అవుట్..!?
cm-revanth-announces-government-to-revise-minimum-wages-benefitting-workers-from-june-2nd

జూన్ 2 నుంచి పెరిగిన వేతనాలు అమలు

జోన్ -1 అన్ స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ 12,750 నుంచి 16 వేలకు పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ 13,592 నుంచి 17 వేలకు పెంచుతూ నిర్ణయించారు. స్కిల్డ్ కార్మికుల వేతనం రూ 13,772 నుంచి రూ 18,500 కి పెంచారు. హై స్కిల్డ్ కార్మికులకు రూ 14,607 నుంచి 20 వేలకు పెంచినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. నైపుణ్యాలు పెంచుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు వివరించారు. దీని ద్వారా విదేశాల్లో భారీ వేతనంతో అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించలేని చదువులతో ఉపయోగం లేదని రేవంత్ అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర యువత స్కిల్స్ పెంచుకొని.. విదేశీ ఉద్యోగాలను అంది పుచ్చు కోవాలని.. ఏఐ వలన వైట్ కాలర్ ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+