CJP: కాక్రోచ్ జనతా పార్టీకి కేంద్రం షాక్..! బీజేపీ రికార్డు బద్దలు కొట్టగానే..!

దేశంలో వ్యవస్ధలపై దాడి చేస్తున్నారంటూ నిరుద్యోగ యువతను బొద్దింకలుగా అభివర్ణిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నాలుగు రోజుల్లోనే భారీ సంచలనం సృష్టించింది.ఇన్ స్టాలో 8.8 మిలియన్ల ఫాలోయర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి షాకిస్తూ .. కేవలం నాలుగు రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లకు చేరుకుంది. దీంతో కేంద్రం ఆ పార్టీకి షాకిచ్చింది.

దేశంలో ప్రశ్నించే యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్ లైన్ లో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం నీట్ తో పాటు పలు అంశాల్లో విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తూ వీడియోలు, పోస్టులు షేర్ చేస్తోంది. దీనికి యువత విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు. రోజురోజుకూ సోషల్ మీడియాలో పెరిగిపోతున్న సీజేపీ ఫాలోయింగ్ కేంద్రాన్ని కంటిమీద కునుకులేకుండా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్స్ లో ఆ పార్టీ అధికారిక ఖాతాను బ్లాక్ చేస్తూ ఎక్స్ నిర్ణయం తీసుకుంది.

X Blocks Cockroach Janta Party Account on Legal Demand Days After It Crossed BJP s Follower Count

ఎక్స్ తమ నిర్ణయం వెనుక లీగల్ డిమాండ్ ఉందని తెలిపింది. అంటే ప్రభుత్వం కోరిన మీదట తొలగించినట్లు చెప్పకనే చెప్పింది. దీంతో ఎక్స్ నిర్ణయంతో పాటు కేంద్రం తీరుపై యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారంటూ వాపోతున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తామంటూ చెప్పుకునే ఎలాన్ మస్క్ తన ప్లాట్ ఫామ్ పై ప్రశ్నించే సీజేపీ ఖాతాను ఎలా బ్లాక్ చేస్తారని పలువురు ట్యాగ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకూ ఎక్స్ స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+