Viral Video: పొలం గట్టుపై అడ్డంగా దొరికిన 14 ఏళ్ల అబ్బాయి.. 15 ఏళ్ల అమ్మాయి.. ప్లీజ్ మాకు పెళ్లి చేయండంటూ..!
ఇటీవలి కాలంలో యువత పలు కారణాలతో చెడు దారులు తొక్కుతున్నారు. చదువుకునే వయసులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నవారు కొందరైతే.. ప్రేమ, పెళ్లితో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు మరికొందరు ఉన్నారు. ఇక డ్రగ్స్, గంజాయి మత్తులో మునిగిపోతున్నవాళ్లు మరోవైపు ఉన్నారు. ఇంకొంత మంది ఏకంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే దాడులు, హత్యలు చేస్తున్నారు. పరిస్థితులు ఏవైనా ఇప్పటి యువత చదువుపై ఆసక్తి తగ్గిపోయి ఇతర కార్యక్రమాలపై వ్యామోహాన్ని పెంచుకుంటున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జెన్ జీ తరంగా చెప్పుకుంటున్న ఇప్పటి యువత భవిష్యత్తుపై తమ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే యువత ఇలా ప్రవర్తిస్తుండటం బాధాకరమైన అంశంగా మారింది.

తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ 14 అబ్బాయి.. 15 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. అయితే పొలం గట్టుపై వాళ్లు ఏకాంతంగా ఉండగా ఊరి ప్రజలు చూసి పట్టుకున్నారు. అడ్డంగా దొరికిపోవడంతో వాళ్ల తల్లిదండ్రుల ముందుకు తీసుకెళ్లారు. అయితే తమకు పెళ్లి చేయాలంటూ మైనర్లు మాట్లాడటం అక్కడ ఉన్న అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఓ వైపు అబ్బాయి మౌనంగా ఉన్నాడు. అమ్మాయి మాత్రం ధైర్యంగా నవ్వుతూ తమకు వివాహం చేయాలని కోరింది. దాంతో తల్లిదండ్రులు ఆ బాలికపై చేయి చేసుకున్నారు. అయినా కూడా ఏమాత్రం భయపడకుండా ఆ బాలిక నిల్చుంది. వీళ్ల వయసు మహా అయితే 14 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని సమాచారం. చదువుకుని, కెరీర్ మీద దృష్టి పెట్టి ప్రయోజకులు కావాల్సిన ఈ చిన్న వయసులోనే వీళ్లకు పెళ్లి కోసం ఇంత ఆరాటం అవసరమా..? అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ వీళ్ల పట్టుబడితే.. వాళ్ల కుటుంబ సభ్యులు బలవంతంగా లేదా ఏమీ చేయలేక వీళ్లకు పెళ్లి చేసినా.. జీవితం పట్ల కనీస అవగాహన, మెచ్యూరిటీ లేని వీళ్ల కాపురం మహా అయితే మరో రెండేళ్లలో విడాకుల వరకు వెళ్లడం ఖాయం అని మాట్లాడుకుంటున్నారు. ఆకర్షణను ప్రేమ అనుకుని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న నేటితరం టీనేజర్ల పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలుగుతోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడానికి అంత ఆత్రుతగా ఉండటం సరైనదేనా..? అని.. మరికొందరు మాత్రం ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మాత్రం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
