తెలంగాణ గ్రామాలకు శుభవార్త.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!

తెలంగాణలోని ప్రతి పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేశాయి. సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.3,185 కోట్ల భారీ ఆర్థిక సాయం అందనుంది.ఈ నిధులతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలను రింగ్ నెట్‌వర్క్ కనెక్టివిటీతో అనుసంధానించనున్నారు.

ఇప్పటికే 10,787 పంచాయతీల్లో నెట్‌వర్క్ ఉండగా, మరో 1,946 పంచాయతీలను లీనియర్ నెట్‌వర్క్ నుంచి రింగ్ టోపాలజీకి అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అదనంగా 36 పంచాయతీల్లో కొత్తగా రింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించనున్నారు.

Telangana BharatNet Telangana Gets 3 185 Crore for BharatNet Project - High-Speed Internet to Reach Every Village

ఒక్కో గ్రామీణ కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాజెక్టు అమలు కానుంది. కేవలం నెట్‌వర్క్ నిర్మాణం మాత్రమే కాకుండా, వచ్చే పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందుకోసం 2026 జూన్‌లో తెలంగాణ ప్రభుత్వం ట్రైకిల్ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రజలకు ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు సులభంగా అందుతాయి. పల్లెల్లోని విద్యార్థులు మెరుగైన విద్యా వనరులను ఉపయోగించుకోవచ్చు. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు తక్షణం తెలుసుకోవచ్చు.

తెలంగాణా ప్రభుత్వ ఆదాయ అన్వేషణ.. వాటిపై ఫోకస్, మంత్రి కీలక ఆదేశాలు!
తెలంగాణా ప్రభుత్వ ఆదాయ అన్వేషణ.. వాటిపై ఫోకస్, మంత్రి కీలక ఆదేశాలు!

ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్, ఉపాధి అవకాశాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ విభజనను తగ్గించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌నెట్ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్ అందించే జాతీయ మిషన్. తెలంగాణలో దీని అమలు వేగవంతం కావడంతో రాష్ట్రం డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనలో మరో అడుగు ముందుకు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+