సజ్జ మసాలా కిచిడీ..ఇలా చేసి తింటే హెల్దీగా.. స్లిమ్ గా కూడా!

చలికాలం వచ్చేస్తే శరీరం చల్లబడి, జీర్ణశక్తి కూడా కొంత మందగిస్తుంది. ఇలాంటి సమయంలో చిరుధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సజ్జలు శరీరానికి సహజమైన వెచ్చదనం ఇస్తాయి. ఇందులో ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. సాధారణ బియ్యం కిచిడీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కానీ సజ్జలు, పెసరపప్పు, కూరగాయలతో చేసే మసాలా కిచిడీ మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి చాలా బాగా పనిచేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

రాత్రంతా నానబెట్టిన అర కప్పు సజ్జలు
కడిగి నానబెట్టిన అర కప్పు పెసరపప్పు
1 కప్పు కూరగాయల ముక్కలు (క్యారెట్, బఠాణీ, బంగాళదుంప, టమాటా)
1 మీడియం ఉల్లిపాయ
2 పచ్చిమిర్చి
1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
అర టీస్పూన్ జీలకర్ర
1 బిర్యానీ ఆకు
3-4 చిటికెల ఇంగువ
2-3 రెమ్మల కరివేపాకు
అర టీస్పూన్ ధనియాల పొడి
పావు టీస్పూన్ గరం మసాలా
పసుపు, కారం, ఉప్పు తగినంత
3 కప్పుల నీళ్లు
2 టేబుల్ స్పూన్ల వంటనూనె
కొద్దిగా నెయ్యి (ఐచ్ఛికం)
తాజా కొత్తిమీర

Healthy Sajja Masala Khichdi Recipe for Weight Loss and Diabetes Control - Perfect Winter Millet Dish

తయారీ విధానం:

ముందుగా సజ్జలను బాగా కడిగి కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీళ్లు పూర్తిగా వడకట్టి, మిక్సీలో నీళ్లు లేకుండా పల్స్ మోడ్‌లో కొద్దిగా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పును కూడా కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి.స్టవ్‌పై మందపాత్రలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారే వరకు వేపాలి.

అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించి, పచ్చిమిర్చి, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం వేసి 2 నిమిషాలు వేయించాలి.ఇప్పుడు గ్రైండ్ చేసిన సజ్జ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలపాలి. 3 కప్పుల నీళ్లు పోసి మళ్లీ కలిపి, లో-మీడియం ఫ్లేమ్‌పై అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి.

కిచిడీ కాస్త దగ్గరపడిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టకుండా లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. సజ్జ రవ్వ మెత్తబడినప్పుడు ఉడికినట్లు. అవసరమైతే కొద్దిగా వేడినీళ్లు కలపవచ్చు.చివర్లో కొత్తిమీర చల్లి, కావాలంటే నెయ్యిలో వేయించిన జీడిపప్పులు వేసుకోవచ్చు. డైట్‌లో ఉన్నవారు నెయ్యి, జీడిపప్పు వదిలేసుకోవచ్చు. కిచిడీ చల్లారాక చిక్కబడుతుంది కాబట్టి కాస్త జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి.

హై ప్రోటీన్ మిక్స్‌డ్ మొలకల కుర్మా.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా!
హై ప్రోటీన్ మిక్స్‌డ్ మొలకల కుర్మా.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా!

ఆరోగ్య ప్రయోజనాలు:

సజ్జల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కావడంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపించి, తినే మోతాదు తగ్గుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి, ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను నిలబెట్టడంలో సహాయపడుతుంది.ఈ కిచిడీని వారానికి 2-3 సార్లు తీసుకుంటే బరువు తగ్గడంలో, జీర్ణశక్తి పెరగడంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే ఈ సజ్జ మసాలా కిచిడీని ఇంట్లో ప్రయత్నించి చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+