ఇకపై వర్షాలకూ ట్రేడింగ్.. చినుకు పడితే లాభాలు పిండుకోవడమే!

సాధారణంగా స్టాక్ మార్కెట్లలో షేర్లు, బంగారం, వెండి లేదా ముడిచమురు వంటి కమోడిటీలపై ట్రేడింగ్ (Trading) చేయడం మనకు తెలుసు. కానీ, ఎప్పుడైనా వర్షంపై ట్రేడింగ్ చేయడం గురించి విన్నారా? అవును, మీరు విన్నది నిజమే! ఇకపై కురిసే వానలను బట్టి కూడా మార్కెట్లో లాభాలు గడించవచ్చు, లేదా నష్టాల నుంచి రక్షణ పొందవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలను ట్రేడింగ్ చేసేందుకు వీలుగా.. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి దేశంలోనే మొట్టమొదటి 'ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ వాతావరణ డెరివేటివ్స్ కాంట్రాక్ట్' (Weather Derivatives Contract)ను ప్రారంభించబోతోంది.

వాతావరణంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా వర్షపాతంలో హెచ్చుతగ్గుల వల్ల వ్యాపారాలకు కలిగే ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పించడమే ఈ సరికొత్త కాంట్రాక్ట్ ముఖ్య ఉద్దేశం. ఇది పూర్తిగా 'క్యాష్-సెటిల్‌డ్ ఫ్యూచర్స్' (Cash-Settled Futures) పద్ధతిలో పనిచేస్తుంది. దీనికోసం భారత వాతావరణ శాఖ (IMD) సేకరించే అధికారిక వర్షపాత డేటాను ప్రామాణికంగా తీసుకుంటామని NCDEX స్పష్టం చేసింది.

Monsoon Trading in India NCDEX to Start Cash Settled Weather Derivatives Contracts Based on IMD Data

సాధారణ బీమాకు మించి.. ఏయే రంగాలకు లాభం?

సాధారణంగా భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా, ఆస్తులు నష్టపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా అందిస్తాయి. కానీ, వానల వల్ల వ్యాపారాలు సక్రమంగా సాగక, సమయం వృథా అయి వచ్చే పరోక్ష నష్టాలను సాధారణ బీమా కవర్ చేయలేదు. ఈ లోటును భర్తీ చేయడానికే NCDEX ఈ వాతావరణ డెరివేటివ్స్‌ను ముందుకు తెచ్చింది.

లేచొచ్చిన రూపాయి ప్రాణం.. ఒక్క ప్రకటనతో బిగ్ రిలీఫ్
లేచొచ్చిన రూపాయి ప్రాణం.. ఒక్క ప్రకటనతో బిగ్ రిలీఫ్

ముఖ్యంగా వ్యవసాయం, లాజిస్టిక్స్ (రవాణా), నిర్మాణ రంగం (Construction), విద్యుత్ మరియు బ్యాంకింగ్ వంటి రంగాలు తమ వాతావరణ ఆధారిత ఆర్థిక నష్టాలను నిర్వహించుకోవడానికి (Hedging) ఈ కాంట్రాక్టులు ఎంతగానో సహాయపడతాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే నాలుగు నెలల నైరుతి రుతుపవనాల వల్ల ముంబైలోని వ్యాపారాలు ప్రతి ఏటా తీవ్రంగా దెబ్బతింటుంటాయి. అక్కడి సరఫరా గొలుసులు (Supply Chains), రవాణా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలు స్తంభించిపోతుంటాయి. అలాంటి సమయాల్లో ఈ ట్రేడింగ్ వ్యాపారులకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది.

RBI: మే 26న కీలక పరిణామం.. అసలేంటి ఈ 'డాలర్-రూపాయి స్వాప్'?
RBI: మే 26న కీలక పరిణామం.. అసలేంటి ఈ 'డాలర్-రూపాయి స్వాప్'?

తక్కువ రుతుపవనాల అంచనా.. భారత్ 'ట్రేడ్‌రెయిన్'!

గత నెలలో వెలువడిన నివేదికల ప్రకారం.. మూడేళ్ల విరామం తర్వాత, ప్రస్తుత 2026 సంవత్సరంలో దేశంలో సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశ వ్యవసాయోత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు దేశ ఆర్థిక వృద్ధి (GDP)పై ఇది తీవ్ర ఆందోళనలు పెంచుతోంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోనే NCDEX ఈ వినూత్న ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేవడం గమనార్హం.

ఈ సరికొత్త ఫీచర్‌పై NCDEX తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన ప్రకటనను పంచుకుంది. అందులో వర్షాన్ని కేవలం ఒక వాతావరణ మార్పుగా కాకుండా, 'మార్కెట్ సంకేతం' (Market Signal)గా అభివర్ణించింది. ఈ డెరివేటివ్‌తో భారతదేశం ఇకపై "ట్రేడ్‌రెయిన్" (TradeRain)గా మారబోతోందని పేర్కొంది. భారీ వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతూ నడుస్తున్న ప్రయాణికులకు విరుద్ధంగా.. ట్రేడింగ్ చార్ట్‌లు చూస్తూ సంతోషంగా నవ్వుతున్న ఒక మహిళను ఆ ప్రకటనలో చూపించారు. "కొందరికి ఇది కేవలం వర్షం కావచ్చు.. కానీ స్మార్ట్ ట్రేడర్లకు ఇదొక అద్భుతమైన అవకాశం" అంటూ ముగించిన ఈ ప్రకటన ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+