డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల చివరి నాటికి ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి బాధ్యతలను స్వీకరించిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా లీవిట్ నూతన రికార్డును లిఖించారు. తన ఇద్దరు చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ వైట్‌హౌస్ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.

28 ఏళ్ల వయసున్న లీవిట్.. డొనాల్డ్ ట్రంప్ రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన ప్రారంభ రోజుల్లోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ట్రంప్ క్యాంప్ లో కీలకంగా వ్యవహించారు. ఆయనకు అత్యంత నమ్మకస్తురాలిగా లీవిట్ కు పేరుంది. దాదాపు 18 నెలలుగా వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో ఆమె సెలవుల్లో వెళ్లారు. మే లో రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సెలవుల తర్వాత తిరిగి ఇటీవలే విధుల్లో చేరారు.

Karoline Leavitt Steps Down as White House Press Secretary to Focus on Motherhood and Family Respons

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా అవసరమైన సమయం, శ్రద్ధను కేటాయిస్తూనే తల్లిగా ఇద్దరు పిల్లల పట్ల బాధ్యతలను నెరవేర్చడం అత్యంత కష్టంగా మారిందని లీవిట్ ఎక్స్‌ లో పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలు, కుటుంబానికి ఎక్కవ సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో ప్రెస్ సెక్రెటరీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఏడాదిన్నర కాలంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేయడం నా జీవితంలో లభించిన ఒక గొప్ప గౌరవం, సాహసం అని ఆమె అభివర్ణించారు.

50 ఏళ్ల నష్టపరిహారం కట్టండి- ట్రంప్ ప్రతిపాదన: అనూహ్య మలుపు
50 ఏళ్ల నష్టపరిహారం కట్టండి- ట్రంప్ ప్రతిపాదన: అనూహ్య మలుపు

వెస్ట్ వింగ్‌లో పనిచేయడం, ఓవల్ ఆఫీస్‌లో లెక్కలేనన్ని గంటలు గడపడం, ప్రపంచవ్యాప్తంగా పర్యటించి విదేశీ నాయకులను కలవడం వంటి ఎన్నో అసాధారణమైన అవకాశాలను ట్రంప్ తనకు కల్పించారని, అన్నిటి కంటే ముఖ్యంగా వైట్ హౌస్ వేదికగా ఆయన తరపున మాట్లాడే విశిష్టమైన గౌరవాన్ని తనకు దక్కిందని పేర్కొన్నారు. ట్రంప్ సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల గురించి తాను ఓ ప్రసె సెక్రెటరీగా గర్వంగా ప్రజలకు తెలియజేశానని వ్యాఖ్యానించారు.

ఈ తెల్లవారు జామున భారీ భూకంపం
ఈ తెల్లవారు జామున భారీ భూకంపం

అమెరికా అధ్యక్షుడికి, వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీగా పని చేయడం అంటే ప్రపంచంలోనే అత్యంత శ్రమతో కూడుకున్న ఉద్యోగాలలో ఒకటని లీవిట్ అన్నారు. తల్లిగా ఇద్దరు చిన్న పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నాననే కారణంతో వైట్ హౌస్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని వివరించారు. తనకు సలహాదారుగా సేవలు కొనసాగించాలని ట్రంప్ కోరారని, ఆ పదవిలో కొనసాగుతానని చెప్పారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, రిపబ్లికన్ పార్టీకి ఎప్పటికీ తాను ఓ మద్దతురాలినేనని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+