Visakhapatnam: విశాఖపట్నానికి కేంద్రం భారీ గుడ్ న్యూస్..! ఏకంగా 1500 కోట్లతో..!
ఏపీలో ఐటీ, వాణిజ్య రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా నగరానికి భారీ ఐటీ పరిశ్రమలు, డేటా సెంటర్లు తరలివస్తున్న నేపథ్యంలో మౌలిక సౌకర్యాలను కూడా అదే స్దాయిలో అభివృద్ది చేసేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగరంలో మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ జాతీయ అపెక్స్ కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది.
కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం విశాఖకు మొత్తం రూ.1500 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులు రాబోతున్నాయి. భారత ప్రభుత్వ అర్భన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద విశాఖపట్నం నగర అభివృద్ధికి ₹1,501.03 కోట్ల విలువైన మూడు కీలక ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) ఆమోదం తెలిపింది. ఇందులో మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) వ్యవస్థ అభివృద్ధి - ₹658.61 కోట్లు కేటాయించింది.

అలాగే మధురవాడలో 24x7 స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ కోసం ₹725.18 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు బల్క్ & సెమీ-బల్క్ వాటర్ సప్లై వ్యవస్థ ఆధునీకరణ కోసం మరో ₹117.24 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో విశాఖ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్దతో పాటు తాగునీటి సరఫరా సమస్యలు తీరబోతున్నాయి. ఇప్పటికే నగరానికి పలు ప్రాజెక్టులు కేటాయించిన కేంద్రం.. నగరంపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.














Click it and Unblock the Notifications