బాబు ఫుల్‌స్టాప్, పవన్ జనసేన బాగుంది: వేణుమాధవ్

రానున్న ఎన్నికల్లో తన పోటీ పైన తాను ఇప్పుడే చెప్పలేనని తెలిపారు. తాను పోటీ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం నుండి అయినా పోటీ చేయగలనని, తనను అభిమానించే నటులు అన్ని ప్రాంతాలలో ఉన్నారని చెప్పారు. తనను అభిమానించే వారు పాకిస్తాన్‌లో ఉంటే అక్కడి నుండి కూడా పోటీకి సిద్ధమని చలోక్తి విసిరారు.
తనకు ఏ ఒక్క జిల్లాలోనో అభిమానులు లేరని చెప్పారు. దేవుడి దయ వల్ల ఇతర దేశాల్లో కూడా ఉన్నారన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననే అంశానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెడతారన్నారు. తన పోటీ విషయమై చంద్రబాబు సమాధానం చెబుతారని తెలిపారు. తనకు రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో అనుబంధముందని చెప్పారు.
పవన్ స్థాపించిన జనసేన పార్టీ పైన స్పందిస్తూ.... జనసేన ఆశయాలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications