ప్రభాస్ కెరీర్‌పై వేణుస్వామి సెన్షేషనల్ కామెంట్స్..అదే జరుగుతోందా..?

Venu swamy vs Prabhas : ఒక పనికోసం పట్టువదలకుండా చివరి వరకు ప్రయత్నిస్తే విజయం చేతికందుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. సినిమా కథ చెప్పేటప్పుడు ఒకరకంగా ఉంటుంది.. షూటింగ్ లో మరోరకంగా జరుగుతుంటుంది.. చివరగా ఫైనల్ కాపీ చూసుకుంటే ఇంకోరకంగా ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమలో ఉండేవారంతా సినిమా బాగా రావాలని జాతకాలను, అదృష్టాన్ని నమ్ముకుంటారు. ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని నమ్ముతారు.

ప్రభాస్ జాతకాలను నమ్మడు : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జాతకాలు అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది వేణుస్వామి. సెలబ్రటీల జాతకాలు చెప్పడంతోపాటు వాటిలో ఏమైనా దోషాలున్నా చెప్పి వారితో అందుకు పరిహారాలు చేయిస్తుంటాడు. తాజాగా ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం చెప్పారు. ప్రభాస్ జీవితంలో ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయని, అదేకాకుండా సినిమా పరిశ్రమ పరంగా కూడా సమస్యలున్నాయన్నారు. కానీ ప్రభాస్ జాతకాలను నమ్మరని, దీనివల్లే ఆయన చేసిన జాతకాల సినిమా (రాధేశ్యామ్) పోయిందన్నారు. భగవంతుడిపై, జాతకాలపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉండాలన్నారు.

venuprabhas

ఎంతోమంది నష్టపోతారు : జాతకాన్ని నమ్మకపోవడంవల్ల ప్రభాసే కాకుండా ఆయన చుట్టూ ఉన్నవారు కూడా నష్టపోతారన్నారు. ఆయనపై ఆధారపడి ఎన్నో కుటుంబాలున్నాయని, ఆయన బాగుంటేనే వారంతా చల్లగా ఉంటారన్నారు. కానీ ప్రభాస్ కు అటువంటి ఆలోచనే లేదని, జాతకం చాలా వరస్ట్ గా ఉందన్నారు. వృశ్చిక రాశి అని, శని, గురువు మారుతూ వస్తున్నారని, అర్థష్ట శని ఒకవైపు ఉండగా, షష్టమ గురువు మరోవైపు ఉన్నాడన్నారు.

నమ్మకం ఉంటేనే ఏదైనా : వెంకటేశ్వరస్వామిని మనం ఎంత బాగా నమ్మితే ఆ నమ్మకం ప్రకారం అన్నీ చేస్తాడని, మెడిసిన్ తీసుకోవాలన్నా దానిమీద ఉన్న నమ్మకంతోనే తీసుకోవడంవల్ల రోగం తగ్గుతుందన్నారు. ప్రభాస్ తో సినిమా తీసే నిర్మాతలు జాతకం చూయించుకోవాలని, ప్రభాస్ కెరీర్ కష్టంగా ఉందని, మళ్లీ మొదటి నుంచి ఈశ్వర్ లాంటి సినిమాలు చేస్తూ రావాల్సి ఉందన్నారు. బాహుబలితోనే గ్రాఫ్ పీక్స్ కు వెళ్లిపోయిందని, ప్రస్తుతం ఆ గ్రాఫ్ పడిపోయిందన్నారు. వైవాహిక జీవిత పరంగా ఫెయిల్యూర్ అవుతారన్నారు.

ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ తర్వాత వేణు స్వామి అంచనా వేసినట్లే ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పడిపోతోందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+