హీరోయిన్ కు వేణుస్వామి జాతక పూజలు.. ఆమె కూడా టాప్ పొజిషన్ లోకి?

వేణుస్వామి... ప్రస్తుతానికి పరిచయం అవసరంలేని పేరు. సినీ, రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీల జాతకాలను చెబుతూ, వారి జీవితంలో ఎప్పుడెప్పుడు ఏం జరగబోతున్నాయో తెలియజేస్తూ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పినదాని ప్రకారం పూజలు చేయించుకున్నవారు టాప్ పొజిషన్ లో ఉన్నారు. దీంతో సెంటిమెంట్లకు ఆలవాలంగా ఉండే తెలుగు సినీ పరిశ్రలో.. వేణుస్వామి పూజలు చేస్తే టాప్ స్టార్ అయిపోయినట్లే.. అనే నమ్మకం బలపడింది.

Venuswamy

తాజాగా ఆయన ఖిలాడి, రామబాణం సినిమాల్లో కథానాయికగా నటించిన డింపుల్ హయాతికి పూజలు చేయించారు. పూజలు చేయించడంవరకు ఎవరూ పట్టించుకోకపోయినప్పటికీ ఆ పూజలో నలువైపులా పెట్టిన వైన్ బాటిల్స్ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవలే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో డింపుల్ కు వివాదం నడిచిన సంగతి తెలిసిందే. దీనిపై వీరిద్దరిలో ఎవరి తప్పు లేదంటూ ఎవరికివారే స్టేట్ మెంట్లు ఇచ్చారు. బహుశా ఈ గొడవవల్ల కావొచ్చు.. లేదంటే రెండు సినిమాలు ఫెయిలవడంతో జాతకాన్ని బాగుచేసుకుందామనే ఆలోచనైనా కావచ్చు.

Venuswamy

ఏదన్నా కానీ చివరకు డింపుల్ హయాతి కూడా వేణుస్వామి చేత పూజలు చేయించుకున్నారు. త్వరలోనే ఈమె కూడా టాప్ స్టార్ అయిపోవడం ఖాయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం మద్యానికి సంబంధించినవి అనారోగ్యాన్ని కలగజేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే పూజలో వైన్ బాటిల్స్ ఉపయోగించారంటే ఏ పూజచేయించారో? ఏ దేవుడికి చేయించారో? అర్థం కాకుండా ఉందనే వ్యాఖ్యలు నెటిజన్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండుమూడు చోట్ల ఉన్న దేవాలయాల్లో కొలువైన భగవంతుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించుకుంటారు. వేణుస్వామి చేయించిన పూజలకన్నా అందులో ఉపయోగించిన వైన్ బాటిల్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+