Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతిలో కుండపోత వర్షం: లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం

చిత్తూరు: ఇటీవల కురిసన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే గురువారం సాయంత్రం తిరుపతిలో మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో నగరం మరోసారి జలమయమైంది. గురువారం రాత్రి 9గంటల నుంచి అరగంటపాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో తిరుపతి నగరంలోని వీధులు, ప్రధాన నగరాలు పూర్తిగా వరదనీటతో మునిగిపోయాయి.

లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలి, మధురా నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపు నీరు చేరింది. ఉరుములుమెరుపులతో కూడిన వర్షం రావడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద ఉన్న శ్రీవారి భక్తులు ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

 Very heavy rains in Tirupati: floods on raods

అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న తరుణంలో మరోసారి భారీ వర్షం కురవడంతో తిరుపతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో మరో మూడురోజులపాటు వర్షాలు

ఇది ఇలావుండగా, ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మరో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నైరుతి బంగాళా ఖాతం, దక్షిణ శ్రీలంక తీరముకు దగ్గర్లో సగటు సముద్ర మట్టానికి 3 .1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించిఉంది. ఉపరితల ఆవర్తనమునకు అనుభందముగా ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29 వ తేదీనాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శనివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చొట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    దక్షిణ కోస్తాంధ్రలో గురువారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+