మీడియా ముందు ఏడ్చేసిన టీవీ నటి విజయరాణి

తాను ఎవరినీ మోసం చేయలేదని విజయరాణి మీడియా ప్రతినిధులతో అన్నారు. కోటి రూపాయల వరకు తనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని, తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా అంతే ఉంటాయని ఆమె చెప్పారు. అసలుకు నాలుగింతలు వడ్డీ చెల్లించానని ఆమె చెప్పారు. అసులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, దానివల్లనే తాను పారిపోయానని ఆమె చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బుల వివరాలను, తాను చెల్లించాల్సిన డబ్బుల వివరాలను తాను పోలీసులకు ఇచ్చినట్లు విజయరాణి తెలిపారు. తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేవని, తన వద్ద డబ్బులు లేకపోతే పోలీసులే తిండి పెట్టారని ఆమె చెప్పారు.
విజయరాణి అధిక వడ్డీలు ఆశచూపి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఆమె 3 నుంచి 20 శాతం వరకు కూడా వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకుందని, అధిక వడ్డీలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
విజయరాణికి చెందిన హైదరాబాదు, గుడివాడల్లోని ఆస్తులను, ఓ కారును, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయరాణితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయినవారిలో ఆమె చెల్లెలు, కుమారుడు, కోడలు కూడా ఉన్నట్లు చెప్పారు. విజయరాణి బంధువులను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications