గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మరో షాక్!
గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన కొడాలి నాని అనుచరులు కరోనా సమయంలో రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు ధైర్యం చేసి తమ స్థలాన్ని నాని అనుచరుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ మండలం వలివర్తిపాడులోని రీసర్వే నెంబర్ 180 చైతన్యనగర్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ల యజమానులకు చెందిన 7.66 ఎకరాల్లో 60 ప్లాట్లను 2020లో నాని అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించారు. ప్లాట్ల కోసం వెళ్లిన యజమానులపై రౌడీలతో దాడులు చేయించారు. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది.
దౌర్జన్యంగా మాట్లాడిన నాని
తీర్పు ప్రతులను చూపించినప్పటికీ అధికారులు మాత్రం ధైర్యం చేయలేకపోయారు. వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. తాము కూడా వైసీపీకి చెందినవారిమేనని, తమ స్థలాలు తమకు ఇప్పించాలంటూ బాధితులు కొడాలి నానికి విన్నించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 20 సంవత్సరాల క్రితం ఏ ధరైతే ఉందో దానికే కొంటామని, ఇష్టమైతే ఇవ్వండి.. లేదంటే వెళ్లిపోండంటూ నాని మాట్లాడారంటూ గతంలోనే బాధితులు వాపోయారు.

బాధితులకు అనుకూలంగా సివిల్ కోర్టు తీర్పు
గుడివాడ సివిల్ కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సరిగ్గా ఇదే సమయానికి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సంచలన విజయం సాధించడంతో వారికి ధైర్యం వచ్చింది. నాని అనుచరులు ఆక్రమించిన స్థలంలో వేసిన కంచెను జేసీబీలతో తొలగించారు. అక్కడ ఉన్న షెడ్డును కూల్చి కొడాలి నాని అరాచకం నశించాలంటూ నినాదాలు చేశారు. తమ స్థలాన్ని నాని ప్రధాన అనుచరుడు, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీగ్యాంగ్ కబ్జా చేసిందని బాధితులు తెలిపారు. గుడివాడ నుంచి విజయం సాధించిన వెనిగండ్ల రాము తమకు న్యాయం చేశారని బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications