మురళికి నో: కరీంనగర్‌కు విద్యాసాగరే, బిజెపి లిస్ట్
హైదరాబాద్: కరీంనగర్ లోకసభ స్థానం మాజీ పార్లమెంటు సభ్యుడు సిహెచ్ విద్యాసాగర రావుకే దక్కింది. బిజెపి నాయకత్వం కరీంనగర్ లోకసభ స్థానం నుంచి విద్యాసాగర్ రావు పోటీకి దించాలని నిర్ణయించింది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును పోటీకి దించాలని ప్రయత్నించింది. అయితే, విద్యాసాగర్ రావు తనకు కరీంనగర్ సీటు కావాల్సిందేనని పట్టుబట్టారు.
విద్యాసాగర రావును నిజామాబాద్ సీటు నుంచి పోటీ చేయాలని కూడా సూచించింది. అయితే అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. దాంతో మురళీధర రావుకు కరీంనగర్ లోకసభ సీటును బిజెపి నాయకత్వం నిరాకరించింది.
కాగా, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవ ర్గంనుంచి బండారు దత్తాత్రేయను, మహబూబ్‌నగర్ నుంచి నాగం జనార్ద్ధన్ రెడ్డిని బరిలోకి దించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి బిజెపి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంకా నిజామాబాద్ నుంచి యెండెల లక్ష్మీనారాయణ, వరంగల్ నుంచి పరమేశ్వర్, హైదరాబాద్ నుంచి భగవంతరావు, మెదక్ నుంచి నరేంధ్రనాథ్‌ల పేర్లు కూడా మంగళవారం రాత్రి బిజెపి విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి

భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్ధానాల జాబితా
మంచిర్యాల : మల్లారెడ్డి
ఆదిలాబాద్ : పయాల్ శంకర్
బోధ్ : మాధవి సుమలత
ముథోల్ : రమాదేవి
ఎల్లారెడ్డి : బనాల లక్ష్మారెడ్డి
నిజామాబాద్ : సూర్యనారాయణ గుప్త
కోరుట్ల : సురభి భూమారావు
ధర్మపురి : కన్నం అంజయ్య
సంగారెడ్డి : కె.సత్య నారాయణ
దుబ్బాకా: రఘునందన రావు
ఉప్పల్ : ప్రభాకర్
ముషీరాబాద్ : కె. లక్ష్మణ్
యాకుత్‌పురా : చర్మాణి రూపరాజ్
మహబూబ్‌నగర్ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
నాగర్‌కర్నూల్ : నాగం శశిధర్ రెడ్డి
కల్వకుర్తి : ఆచారి
షాద్‌నగర్ : ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి
మునుగోడు : మనోహర్ రెడ్డి
ఆలేరు : కాసం వెంకటేశ్వర్లు
జనగాం : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
పినపాక : చందా లింగయ్య దొర












Click it and Unblock the Notifications