శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పాట వింటే రోజా "మెగా"స్టెప్పులు వేయాల్సిందే : ఆగేదే లే- మంత్రిగా ఉన్నా...!!

|
Google Oneindia TeluguNews

మంత్రి రోజా. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అయినా.. తనకు నచ్చిన ఆ పాట వింటే మాత్రం ఆగేదే లే అంటున్నారు. మంత్రి అయినా.. తాను ఎక్కడున్నా ఆ పాట వినిపిస్తే వెంటనే స్టెప్పులు వేసేస్తున్నారు. గతంలో ఒక టీవీ షో లో ఈ పాటకు రోజా పలు సందర్భాల్లో స్టెప్పులు వేశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నాడు చేసిన ఆ పాట రోజా హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో..ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా...ఆ పాటకు తాజాగా వేసిన స్టెప్పులు చూస్తే అసలు రోజా బయటకు వచ్చేసారనే చర్చ మొదలైంది.

ఆ పాట వింటూనే రోజా డాన్స్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న హంసధ్వని తొమ్మిదవ వార్షకోత్సవ ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. మంత్రి రోజాను డైరెక్టర్ స్వాతి సోమనాథ్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వేదిక మీదకు తీసుకొచ్చారు. హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావటం పైన రోజా హర్షం వ్యక్తం చేసారు. ఈ సంస్థ ద్వారా మూడు రోజుల పాటు అక్కడ ధ్యాన..నాట్య..సంగీత ప్రదర్శనలను ఏర్పాటు చేసారు.

స్టెప్పులతో హోరెత్తిస్తూ

స్టెప్పులతో హోరెత్తిస్తూ

మార్కులు - ర్యాంకుల కోసం పిల్లలపైన ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ విధంగా ద్యానం ద్వారా వారిలో మనసిక ఒత్తిడి జయించేలా అవకాశం కల్పించటం అభినందనీయ మన్నారు. ఇక, ఇదే సమయంలో కార్యక్రమ నిర్వాహకులు రోజా హీరోయిన్ గా ఉన్న సమయంలో చిరంజీవితో కలిసి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలోని చామంతి పువ్వా ..పువ్వా పాట ప్లే చేశారు. అంతే..ఇక రోజా ఆగలేదు. ఆ పాటకు తగినట్లుగా స్టెప్పులు వేశారు. రోజాతో పాటుగా సంస్థ నిర్వాహకులు సైతం స్టెప్పులు కలిపారు. రోజాతోపాటు ఆహుతులు కూడా డాన్స్ చేయడంతో ఆ సంప్రదాయ నృత్యానికేతన్ ప్రాంగణం కరతలధ్వనులతో మార్మోగిపోయింది.

ప్రశంసలు - విమర్శలు

ప్రశంసలు - విమర్శలు

గతంలో రోజా జబర్ధస్థ్ లోనూ డాన్స్ మాస్టర్ శేఖర్ తో కలిసి ఒక ప్రత్యేక ఈవెంట్ లో రోజా ఈ పాట మొత్తానికి డాన్స్ చేసారు. తనకు ఇది చాలా ఇష్టమైన పాటగా రోజా చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు మంత్రి అయిన తరువాత రోజా తాను సుదీర్ఘ కాలం చేసిన జబర్ధస్త్ కు వీడ్కోలు పలికారు. మంత్రిగా ఉంటూ పాల్గొనలేనని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు మంత్రిగా ఉంటూనే ఈ స్టెప్పులు వేయటం పైన ఆనందిస్తూ.. అభినందించిన వారు కొందరైతే..మంత్రిగా ఉంటూ ఆ స్టెప్పులు ఏంటంటూ విమర్శించే వారు ఉన్నారు. ఇప్పుడు రోజా స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
Minister Roja Dance in Srikakulam became viral in social media, Roja shakes her leg for a dance for Chiranjeevi song.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X