వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం - పల్లకిలో ఊరేగింపు..!!
వైసీపీ ఎమ్మెల్యేను ప్రజలు ఊరేగించారు. పాలాభిషేకం చేసారు. తమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు అభిమానం చాటచుకున్నారు. తనకు లభించిన గౌరవంతో ఆ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు చెబుతూ ఈ రకంగా తమ అభిమానం ప్రదర్శించారు. ఇప్పడుు వైసీపీ ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన ఆదరణ పార్టీలో ఆసక్తి కర చర్చకు కారణమైంది.
వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం - పల్లకిలో ఊరేగింపు..!!#YSRCPAgain2024 #mlaJogarao #apgovt #Oneindiatelugu pic.twitter.com/1UnAjKohbJ
— oneindiatelugu (@oneindiatelugu) June 10, 2023
అలజంగి జోగారావు పార్వతీ పురం ఎమ్మెల్యేగా ఉన్నారు. బలిజి పేట మండలం పి. చాకరాపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ ఇప్పుడు నెరవేరింది. గత యబై ఏళ్లుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి అయినా గ్రామం నుంచి బయటకు రావాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడేవారు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళడం గ్రామానికి రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వటం మినహా అమలు కాలేదు.న ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు.

గ్రామస్థులకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో ఎమ్మెల్యే నాలుగు కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయించారు. దీంతో, తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న హామీని నిలబెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఊరేగించారు. పాలాభిషేకం చేసారు. నాలుగు కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయించారు..రోడ్డు నిర్మాణంతో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామానికి దశాబ్దాల కల నెరవేరింది. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో ఆయనను తమ గ్రామానికి సాధారంగా ఆహ్వానించారు. మేళ, తాలలతో ఊరేగించారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. అనంతరం గ్రామంలోని మహిళలు వందల లీటర్ల పాల బిందెలతో పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.












Click it and Unblock the Notifications