అంబటి రాంబాబు "మెగా" స్టెప్స్ తో సందడి - భోగీ వేళ డాన్స్ వీడియో వైరల్..!!
తెలుగు లోగిళ్లలో భోగి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇక, ప్రముఖులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక, ఈ సారి వైసీపీ ఎమ్మెల్యేలు సండది మూమూలుగా లేదు. వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కడప జిల్లా శెట్టిపల్లిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆనందం పంచుకున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు భోగి వేడులను ఈ సారి మరింత ప్రత్యేకంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ డాన్స్ వేసారు.
అంబటి రాంబాబు ప్టెప్పులు
కొందరు మహిళలతో కలిసి స్టెప్పులు వేసారు. చిరంజీవిని అనుకరిస్తూ మెగా స్టెప్పులతో సందడి చేసారు. సంప్రదాయబద్దంగా వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు - కార్యకర్తలు కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ పదునైన మాటలతో ప్రత్యర్దుల పైన విరుచుకుపడే అంబటి రాంబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో సమావేశం.. ఆ తరువాత ఆయన స్పందించిన తీరు పైన అంబటి రియాక్ట్ అయ్యారు. "అన్నయ్య" ను చూసి నేర్చుకో "తమ్మడూ " అంటూ పంచ్ వేసారు.

భోగి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా
ఇక, వచ్చే కేబినెట్ లో అంబటికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా సమయంలో మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఇప్పుడు అంబటి రాంబాబు భోగా మంటల చుట్టూ వేసిన స్టెప్పులు.. డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అంబటి డాన్స్ ను పలువురు ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
#YSRCP MLA #AmbatiRambabu Celebrating #Bogi #Andhra pic.twitter.com/gPUrRh1imW
— Medi Samrat (@Medi2Samrat) January 14, 2022












Click it and Unblock the Notifications