వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి దాండియా డాన్సు హోరు - గుజరాతీ సంప్రదాయంలో..!!
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి దసరాను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దసరా నాడు ఆట పాటలతో సందడి చేసారు. గుజరాతీ వస్త్ర ధారణలో దాండియా డాన్స్ తో హోరెత్తించారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ నుండి టిక్కెట్ దక్కించుకున్న శ్రీదేవి రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నిత్యం ప్రజలతో..సమీక్షలతో బీజీగా ఉండే ఎమ్మెల్యే శ్రీదేవి దసరా మాత్రం వినూత్నంగా జరుపుకున్నారు.
గుజరాతీ సాంప్రదాయంలో ఎమ్మెల్యే శ్రీదేవి
దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో నాడు ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దాండియా నృత్యం కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించి..గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య హిళలతో కలిసి కాసేపు డ్యాన్సులతో హోరు చేశారు.కాసేపు ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి వారి కుమార్తెలతో కలిసి సంప్రదాయ బద్దంగా ఆడారు.

దాండియా ఆట..పాటలతో సందడి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ దాండియా డ్యాన్స్ ఆడటంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవీ శరన్నావరాత్రుల సందర్భంగా గుజరాతీ సంప్రదాయంలో లయబద్దమైన నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.హైదరాబాద్ లో దసరా వేడుకలను గుజారాతీలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ లో సుదీర్ఘ కాలం ఉన్న శ్రీదేవి పండుగల సమయంలో వారితో కలిసి సందడి చేయటం పరిపాటిగా చెబుతున్నారు.
Recommended Video

కుమార్తెలతో కలిసి దసరా వేడుకలు
అయితే, ఎమ్మెల్యే అయిన తరువాత మాత్రం కరోనా కారణంగా గతంలో ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు స్థానిక మహిళలతో పాటుగా కుమార్తెలతో కలిసి దాండియా ఆట పాటలతో డాన్స్ చేసారు. ఆ సమయంలో శ్రీదేవి భర్త సైతం ఉన్నారు. అయితే, నిత్యం కనిపించే లైఫ్ కు డిఫరెంట్ లో ఎమ్మెల్యే శ్రీదేవి పూర్తి గుజరాతీ తరహాలో కనిపించారదు. ఇప్పుడు శ్రీదేవి దాండియా డాన్స్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications